నిర్మల్ లో కాంగ్రెస్ జనజాతర సభలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఈ దేశ రాజ్యాంగాన్ని రక్షించేందుకు కృషి చేస్తోందన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తోంది.. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే భారత రాజ్యాంగం ని మార్చేస్తామంటున్నారు.. రాజ్యాంగం మారితే రిజర్వేషన్లు రద్దు అవుతాయి.. ఈ దేశంలో బీజేపీ ధనికులు కోసం పని చేస్తోంది.. సంపన్నులకు 16 లక్షల కోట్లు మాఫీ చేసింది.. ఆ డబ్బులతో దేశంలోని పేదలకు ఒక్కరికి 25 వేల రూపాయలను ఇవ్వవచ్చు అని ఆయన పేర్కొన్నారు. మేము రుణమాఫీ చేస్తే, ఉపాధి హామీ పనులు ఇస్తే ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు అంటున్నారు.. మరి సంపన్నులకు దోచిన సొమ్ము మాట ఏంటి.. కాంగ్రెస్ పార్టీ ఈ పద్ధతిని రూపు మాపేందుకు కృషి చేస్తోంది అని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.
Read Also: Samantha : ఉర్ఫీ డ్రెస్ పై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
తెలంగాణలో ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని రాహుల్ గాంధీ అన్నారు. ఇదే పద్దతిలో భారత దేశ ప్రజలకు కూడా కొన్ని హామీలను ఇస్తున్నాం.. పేద కుటుంబానికి ఏటా లక్ష రూపాయలు బ్యాంకు అకౌంట్ లో జమ చేస్తామన్నారు. దేశంలోని నిరుద్యోగుల యువత కోసం ఉద్యోగం పక్కా అనే స్కీం తెస్తున్నాం.. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి చూపిస్తాం.. ఒక సంవత్సరం పాటు శిక్షణతో పాటు 8500 భృతి లక్ష సాయం ఇవ్వనున్నాము అని ఆయన చెప్పారు. దేశంలో ఉన్న 30 లక్షల ఉద్యోగాల ను భర్తీ చేస్తాం.. అటవీ భూములపై మొదటి హక్కులు ఆదివాసులవే.. వారి భూ సమస్య పరిష్కరిస్తాం.. ఉపాధి హామీ వేతనాన్ని 400కి పెంచుతాం.. దళిత, గిరిజన, బీసీ, మైనార్టీల జనాభా కలిసి 90 శాతం ఉన్నారు.. వారి బాధలు ఎవరికి పట్టవు.. దేశంలో ఉన్న ఐఏఎస్ ల్లో ప్రభుత్వ శాఖల అధిపతుల్లో బీసీల సంఖ్య చాలా తక్కువ ఉంది అని రాహుల్ గాంధీ వెల్లడించారు.