సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి టీ. పద్మారావు గౌడ్ కి మద్దతుగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని రామ్ నగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు.
ప్రతి ఇంటికి వెళ్తుంటే వాలంటరీలు ఉన్నప్పుడు మాకు పెన్షన్ మా గడపకే తెచ్చేవారు అని చెబుతున్నారు.. మేము మళ్ళీ జగనన్న గెలిపించుకుంటామని చెప్తున్నారని కేశినేని శ్వేత అన్నారు.
ఇవాళ ఒక్కరోజే నియోజకవర్గంలోని సుమారు 20 గ్రామాల నుంచి 500కు పైగా కుటుంబాలు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వారిలో పెదకూరపాడు, హుస్సేన్ నగర్, బెల్లంకొండ, వెంకటాయపాలెం, అమరావతి, మునగోడు, అచ్చంపేట, వేల్పూరు, కస్తల మండలాలకు చెందిన 20 కుటుంబాలు టీడీపీని వదిలి పెట్టి వైసీపీలో చేరారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు మండలంలోని ఉస్తేపల్లి గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మొండితోక జగన్ మోహన్ రావు ఉత్చాహంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఇన్వెస్ట్మెంట్ కంపెనీ బెర్క్షైర్ యాన్యువల్ మీటింగ్లో తొలిసారి ఇండియన్ స్టాక్ మార్కెట్ గురించి వారెన్ బఫెట్ స్పందించారు. భారతదేశంలో షేర్లు గత 20 ఏళ్లలో మంచి పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయన్నారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)ను భారత్లో విలీనం చేస్తామంటూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా రియాక్ట్ అయ్యారు.
మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024కు ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్లు సమాచారం. టోర్నమెంట్ ఆతిథ్య దేశాల్లో ఒకటైన వెస్టిండీస్కు ఉత్తర పాకిస్తాన్ ప్రాంతం నుంచి బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తుంది.