Indian Railways: భారతీయ రైళ్లు కొత్త లుక్ను సంతరించుకుంటున్నాయి. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు సేవలందిస్తోన్న ట్రైన్స్ కు కొత్త బోగీలు ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 370 రైళ్లకు 1000 కొత్త జనరల్ బోగీలను అమర్చాలని చూస్తుంది.
CBSE Exam: సీబీఎస్ఈ 10, 12వ తరగతులకు సంబంధించి 2025 సంవత్సరానికి పరీక్ష తేదీలను వెల్లడించింది. ఇంతకు ముందు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చెప్పినట్లుగా విడుదల చేసిన తేదీ షీట్ ప్రకారం సీబీఎస్ఈ బోర్డు 12వ తరగతి ఎగ్జామ్స్ ఫిబ్రవరి 15వ తేదీన ప్రారంభం కానున్నాయి.
UP Accident: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో యమునా ఎక్స్ప్రెస్వే రోడ్డు నెత్తురోడింది. ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన ఓ వోల్వో బస్సు ఒకటి.. ట్రక్కును స్పీడ్ గా ఢీ కొనింది. ఈ ప్రమాదంలో సంఘటన ప్రదేశంలోనే ఐదురుగు చనిపోగా.. మరో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Canada-India Row: గత కొన్నాళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు పథకం పన్నిన విషయం ప్రధాని నరేంద్ర మోడీకి తెలుసంటూ కెనడియన్ మీడియా కథనాలు ప్రచారం చేసింది.
వేములవాడలో ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్సే.. ఇప్పుడు మిగిలిన వాటిని పూర్తి చేసేది కూడా కాంగ్రెస్సేనని అన్నారు. కేసీఆర్ గడీలను కూల్చేందుకే పాదయాత్ర చేశానని తెలిపారు. కరీంనగర్ జిల్లా ఉద్యమాలకు నాయకత్వం వహించింది.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని సోనియా ఆనాడు మాట ఇచ్చారు.. కరీంనగర్ గడ్డపై ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్లో పలుచోట్ల హోటల్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు చేశారు. నగరంలో ఫుడ్ కల్తీ ఘటనలు చోటు చేసుకుంటుండటంతో ఈ రోజు తనిఖీలు నిర్వహించారు. జూబ్లీహిల్స్, అమీర్ పేట్లోని ఉత్తరాస్ టిఫిన్స్, అయితే బిర్యానీ, టిబ్బ్స్ ప్రాక్టీస్, కింగ్స్ ఆఫ్ కబాబ్స్తో పాటు మెహదీపట్నంలోని అబ్దుల్ బాయ్స్ హాస్టల్, మధురానగర్లోని యూనివర్సల్ ఆల్ మాతం మండి కబాబ్స్ అండ్ బిర్యానీ సెంటర్లలో అధికారులు తనిఖీలు చేశారు.
వేములవాడలో రూ.679 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు. రూ.236 కోట్లతో మిడ్ మానేరు రిజర్వాయర్ భూ నిర్వాసితులకు 4696 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన.. రూ.166 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల పాస్టర్ బ్లాక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. రూ.50 కోట్లతో వేములవాడ పట్టణంలో నూలు డిపో నిర్మాణం.. రూ.47 కోట్ల 85 లక్షలతో మూల వాగు నుంచి రాజన్న ఆలయం వరకు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన.. రూ.42 కోట్లతో రుద్రంగి మండలంలో…
P. Chidambaram: ఎయిర్సెల్- మ్యాక్సిస్ మనీలాండరింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరానికి ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది.