Maharashtra CM: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమి స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతుంది. మొత్తం 288 స్థానాలకు గానూ 221 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీయే సిద్ధమైంది. ఈ మేరకు ఈనెల 25వ తేదీన లెజిస్లేటివ్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం.
ఎన్నికల ఫలితాల సరళి చూస్తుంటే ఏదో తప్పు జరిగినట్లు కనిపిస్తోందని సంజయ్ రౌత్ అన్నారు. మా సీట్ల కొన్ని దోచుకున్నట్లు సమాచారం.. ఇది ప్రజల నిర్ణయం కానేకాదు అని పేర్కొన్నారు.
Netanyahu: గాజాలో యుద్ధ నేరాలు, అమానుష చర్యలకు సంబంధించి తనపై అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీసీ) అరెస్టు వారెంట్ జారీ చేయడాన్ని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా మండిపడ్డారు. ఇజ్రాయెల్‌ను రక్షించకుండా తనను ఏ శక్తీ ఆపలేదని పేర్కొన్నారు.
Kerala High Court: వామపక్ష సర్కార్ కు బిగ్ షాక్ తగిలింది. 2017లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ కాన్వాయ్‌లో వెళ్తుండగా నల్లజెండాలు ప్రదర్శించిన ముగ్గురు వ్యక్తులపై అభియోగాలను కేరళ హైకోర్టు రద్దు చేసింది.
Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత కొనసాగుతోంది. ఈరోజు (శుక్రవారం) ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 11.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయింది.
Zelensky: రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే తాజాగా కీవ్‌పై మాస్కో ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. దీనిపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్స్కీ చేసిన పోస్ట్‌లో.. ఈ దాడిపై ప్రపంచ దేశాలు స్పందించాలని కోరారు.
Massive Encounter: ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు- మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు చోటు చేసుకుంది. సుమారు 10 మంది మావోలు మృతి చెందినట్లు సమాచారం.