మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మలబార్ హిల్‌లో సంపన్నులు ఓటేయరని గోయెంకా వ్యంగ్యాస్త్రాలు సంధింస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్టు వైరల్‌గా మారింది. ఆ పోస్టులో.. మలబార్ హిల్‌లో సంపన్నులు పోలింగ్ కేంద్రానికి మెర్సిడెస్ బెంజ్‌లో వెళ్లాలా? లేదంటే బీఎండబ్ల్యూ కారులో వెళ్లాలా అని చర్చిస్తూ కూర్చుంటారని ఎద్దేవా చేశారు.
అఖిలేష్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఒక్క ఓటు కూడా వృథా కానప్పుడే సంపూర్ణ ఫలితాలు వస్తాయన్నారు. యూపీలోని ఓటర్లు తమ ఓటు హక్కును 100 శాతం వినియోగించుకునేందుకు తమ ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారని చెప్పుకొచ్చారు.
Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత నానాటికీ క్షీణిస్తోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400లకు పైగా నమోదైతుంది. ఈ నేపథ్యంలో 50 శాతం ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Pakistan: దాయాది దేశం పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. బన్నూలోని చెక్ పాయింట్ దగ్గర ఉన్న ఓ కారును ఆత్మాహుతి దళ సభ్యుడు పేల్చి వేశాడు. కారును పేల్చిన తర్వాత అతని సహచరులు కాల్పులకు దిగినట్లు అక్కడి మీడియా తెలిపింది.
రష్యా, ఉక్రెయిన్ల మధ్య రోజురోజుకు యుద్ధ తీవ్రత పెరిగిపోతుంది. తమ దేశంపైకి దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్‌కు అమెరికా పర్మిషన్ ఇవ్వడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు కోపం తెప్పించింది. దీంతో ఆయన అణ్వస్త్ర వినియోగానికి సంబంధించిన ఫైల్ మీద సంతకం పెట్టినట్లు సమాచారం.
Maharashtra Election 2024: ఈరోజు (బుధవారం) ఉదయం 7గంటలకు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి.
Hemant Soren: తనపై అసత్య ప్రచారం చేసేందుకు బీజేపీ భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు పెడుతోందంటూ ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఆరోపణలు చేశారు. ప్రజల్లో విద్వేషాన్ని రగిల్చేందుకు యత్నిస్తోందన్నారు.
World War 3: మరో రెండు నెలల్లో అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ పదవీకాలం ముగియనుంది. ఈ సందర్భంగా బైడెన్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి తీసుకున్న ఓ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది.
Parliaments Session: ఈ నెల 25 నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించింది. నవంబర్ 24న ఆల్ పార్టీ మీటింగ్ ను ఏర్పాటు చేసింది.