CBSE Exam: సీబీఎస్ఈ 10, 12వ తరగతులకు సంబంధించి 2025 సంవత్సరానికి పరీక్ష తేదీలను వెల్లడించింది. ఇంతకు ముందు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చెప్పినట్లుగా విడుదల చేసిన తేదీ షీట్ ప్రకారం సీబీఎస్ఈ బోర్డు 12వ తరగతి ఎగ్జామ్స్ ఫిబ్రవరి 15వ తేదీన ప్రారంభం కానున్నాయి. మొదటి పేపర్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌గా ఉండబోతుంది. అలాగే, 10వ తరగతి బోర్డు ఎగ్జామ్స్ ఫిబ్రవరి 15, 2025న ఇంగ్లీష్ పేపర్‌తో స్టార్ట్ అవుతుంది. గత కొన్నేళ్ల సంప్రదాయానికి స్వస్తి చెప్పి ఈసారి ప్రధాన సబ్జెక్టులకు ముందుగానే పరీక్షలు నిర్వహించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్ణయించింది. 10వ తరగతి పరీక్షలు మార్చి 18 వరకు, 12వ తరగతి ఎగ్జా్మ్స్ ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి.
Read Also: Mancherial: మంచిర్యాలలో 600 పడకల ఆసుపత్రి.. నిర్మాణ పనులకు మంత్రి దామోదర శంకుస్థాపన..
ఒక విద్యార్థికి సంబంధించిన రెండు సబ్జెక్టుల పరీక్షలు ఒకే తేదీన జరగకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఉదయం 10.30 గంటల నుంచి పరీక్షలు స్టార్ట్ కానుంది. ఎగ్జామ్స్ ప్రారంభానికి 86 రోజుల ముందు తొలిసారిగా డేట్ షీట్‌ను రిలీజ్ చేశామని.. స్కూల్స్ సకాలంలో LOCని సమర్పించడం వల్ల ఇది సాధ్యమైందని అధికారులు చెప్పుకొచ్చారు.