UP Accident: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో యమునా ఎక్స్‌ప్రెస్‌వే రోడ్డు నెత్తురోడింది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఓ వోల్వో బస్సు ఒకటి.. ట్రక్కును స్పీడ్ గా ఢీ కొనింది. ఈ ప్రమాదంలో సంఘటన ప్రదేశంలోనే ఐదురుగు చనిపోగా.. మరో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఢిల్లీ నుంచి అజాంఘడ్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన డబుల్ డెక్కర్ బస్సు.. తప్పల్ దగ్గర ఎదురుగా వస్తున్న ఖాళీ బీర్ల సీసాల ట్రక్కును ఢీ కొట్టేసింది.
Read Also: Narayanpet Incident: విద్యార్థులు అస్వస్థత గురైన ఘటన.. హెడ్ మాస్టర్ సస్పెండ్..
ఇక, ఈ ఘటనలో ఐదుగురు మరణించగా.. ఇందులో ఓ పసికందు, ఓ మహిళ, ముగ్గురు పురుషులు ఉన్నట్లు తెలుస్తుంది. మరో 15 మంది గాయపడ్డారు. ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం మొత్తం తుక్కుతుక్కు అయిపోయింది. అందులో చిక్కుకుపోయిన ప్రయాణికుల్ని అతి కష్టం మీద బయటకు తీయగా.. గాయపడిన వారిని జెవార్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
यमुना एक्सप्रेस वे पर हुआ बड़ा हादसा, कांच से भरे ट्रक और वोल्वो बस में हुई टक्कर
अलीगढ़ : यमुना एक्सप्रेसवे पर वोल्वो बस और काँच से भरे ट्रक की हुई भिड़ंत, टप्पल के समीप हुआ हादसा। एक दर्जन से अधिक यात्रियों के घायल होने की सूचना। यात्रियों के बीच मची चीख पुकार। PS TAPPAL… pic.twitter.com/NlsQHitlJp
— Praveen Vikram Singh (@praveen_singh5) November 20, 2024