Justice Sanjiv Khanna: దేశ రాజధానిలో ఢిల్లీలో నానాటికీ పెరుగుతున్న కాలుష్యం నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా కీలక సూచనలు చేశారు. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతుండటంతో వీలైతే జడ్జీలు వర్చువల్‌గా కేసుల విచారణ చేయాలని ఆదేశించారు.
జీ20 సమ్మిట్ తర్వాత సంప్రదాయంగా ప్రపంచ దేశాధినేతలు దిగే ఫోటోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో, ఇటలీ ప్రధాని జార్జియా మెలొనీలు కనిపించకపోవడం చర్చనీయాంశమైంది.
North Korea-Russia: రష్యా- ఉక్రెయిన్ల మధ్య యుద్ధం నేపథ్యంలో మాస్కోకు మద్దతుగా నార్త్ కొరియా పెద్ద మొత్తంలో సైనిక సాయం అందిస్తుంది. ఈ క్రమంలో కీలక పరిణామం జరిగింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో రష్యా సహజ వనరులు మంత్రి అలెగ్జాండర్ క్లోజోవ్ సమావేశం అయ్యారు.
S Jaishankar: బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో కొనసాగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా కేంద్రమంత్రి జైశంకర్ చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యితో భేటీ అయ్యారు.
Meloni-Modi: బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సులో పలు దేశాధినేతలతో భారత ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో మోడీ సమావేశం అయ్యారు. ఈ మెలోడీ మూమెంట్ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ రియాక్ట్ అయ్యారు.. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీని దేశ రాజధానిగా కొనసాగాల్సి ఉందా అని క్వశ్చన్ చేశారు.
Russia-Ukraine War: రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా ఖండంలో చోటు చేసుకున్న అత్యంత భీకరమైన యుద్ధం రష్యా-ఉక్రెయిన్ వార్. 21వ శతాబ్దంలోనే అతి దారుణమైన పోరుగా నిలిచిన ఈ యుద్ధం నేటి ( మంగళవారం)తో 1000వ రోజుకు చేరుకుంది.
GSAT-20: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రూపొందించిన అత్యంత అధునాతన సమాచార శాటిలైట్ జీశాట్-20 (జీశాట్-N2) నింగిలోకి దూసుకుపోయింది. స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ఈ జీశాట్-20ను నింగిలోకి మోసుకుపోయింది.
Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల హడావుడి నెలకొన్న సమయంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఎన్సీపీ (ఎస్పీ) నేత, మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెహికిల్ పై నాగ్‌పుర్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.
Sabarimala: శబరిమలకు అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వేలాది మంది భక్తులు రావడంతో శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిపోతున్నాయి. ఇక, అయ్యప్ప స్వామి దర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతుంది.