Jupally Krishna Rao: రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్ ది అని ఆరోపించారు.
Lagacharla Case: వికారాబాద్ లోని లగచర్లలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి కేసులో A2 నిందితుడు సురేశ్ ను పోలీసులు విచారణ చేస్తున్నారు. రెండు రోజుల కస్టడీలో భాగంగా వికారాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ విచారిస్తున్న పోలీసులు.
Harish Rao: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో తన మీద నమోదైన కేసును కొట్టివేయాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు.
Eknath Shinde: మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎం ఏక్నాథ్ షిండే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఈరోజు (డిసెంబర్ 3) థానేలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇక, హస్పటల్ కి తీసుకెళ్లగా, వైద్యులు అతనికి పూర్తి స్థాయిలో ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు.
తమిళనాడు రాష్ట్రంలో ఫెంగల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. భారీ వర్షాలతో విల్లుపురం జిల్లాలో వరద బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనను నిలిపి వేయాలని వారితో చర్చలు జరిపేందుకు వెళ్లిన సమయంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పొన్ముడి సహా ఇతర డీఎంకే నేతలపై పెద్ద ఎత్తున బురదను చల్లారు.
Tiger Search Operation: కొమురం భీం జిల్లాలోని ఇటిక్యాల పహాడ్ గ్రామం దగ్గర్లోని ప్లాంటేషన్ లో పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. నిన్న మహారాష్ట్ర సరిహద్దుల్లో కూడా పులి పాదముద్రలు గుర్తించడం జరిగింది. తెలంగాణా సరిహద్దు గ్రామంతో పాటు మహారాష్ట్ర ప్రాంతంలో ఒక క్యాటిల్ కిల్ జరిగిందని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పేర్కొనింది.
తెలంగాణ రాష్ట్రంలోని రెండు వేర్వేరు కాలేజీల్లో ఒకే రోజు ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతుంది. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో హాస్టల్ విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు.
తమిళనాడు సీఎం స్టాలిన్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో వరదల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. తమిళనాడుకు సహాయ, సహకారాలు అందిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.