Tiger Search Operation: కొమురం భీం జిల్లాలోని ఇటిక్యాల పహాడ్ గ్రామం దగ్గర్లోని ప్లాంటేషన్ లో పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. నిన్న మహారాష్ట్ర సరిహద్దుల్లో కూడా పులి పాదముద్రలు గుర్తించడం జరిగింది. తెలంగాణా సరిహద్దు గ్రామంతో పాటు మహారాష్ట్ర ప్రాంతంలో ఒక క్యాటిల్ కిల్ జరిగిందని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పేర్కొనింది. రెండు శాంపిల్స్ ను హైదరాబాద్ లోని CCMBకి పంపించాం.. దాడి చేసింది ఒక పులేనా లేదా రెండు వేర్వురు పులులా అనేది రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుందన్నారు. ఇక, ఇటిక్యాల పహాడ్ గ్రామంతో పాటు శివారులో 21 ట్రాప్ కెమెరాలు అమర్చాం.. కాగజ్ నగర్ డివిజన్ లో మొత్తం 100 ట్రాప్ కెమెరాలు అమర్చినట్లు ఆసిఫాబాద్ డీఎఫ్ ఓ నీరజ్ కుమార్ టిబ్రేవాల్ చెప్పుకొచ్చారు.
Read Also: Pushpa2TheRule : బుక్ మై షోలో పుష్ప ‘రికార్డ్స్ రపరప’
కాగా, గ్రామస్తులు అందరూ జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. బయటికి వెళ్ళేటప్పుడు అందరూ గుంపులు గుంపులుగా వెళ్లాలి.. కాగజ్ నగర్ డివిజన్లో నలుగురు సభ్యులతో కూడిన దాదాపు 35 టీమ్స్ తిరుగుతున్నాయి.. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.. ప్రజలు ఎక్కడైనా పులి కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఎవరు కూడా పులికి హాని జరిగేటట్టు చేయకూడదు అని సూచించారు. పులి ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాలలోనే సంచరిస్తుంది.. పులి ఒక్క రోజులో 30 కిలో మీటర్లకు పైగా ప్రయాణం చేస్తుంది.. మహారాష్ట్ర ప్రాంతం దగ్గర ఉండటంతో వెళ్లి వచ్చేస్తుంది.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆసిఫాబాద్ డీఎఫ్ ఓ నీరజ్ కుమార్ టిబ్రేవాల్ తెలిపారు.