Harish Rao: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో తన మీద నమోదైన కేసును కొట్టివేయాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు. సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిసెంబర్ 1వ తేదీన హరీష్ రావుపై కేసు నమోదు చేశారు. కాగా, పంజాగుట్ట పీఎస్ లో హరీష్ రావు తన ఫోన్ టాప్ చేయించారని చక్రధర్ కంప్లైంట్ చేశారు. హరీష్ రావుతో పాటు మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు.
Read Also: Vitamin D In Winter: శీతాకాలంలో ఎక్కువతున్న విటమిన్ డి లోపం.. అధిగమించడానికి ఇలా చేస్తే సరి
అయితే, తనపై రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో మాజీమంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. నిరోధర ఆరోపణలు చేసి సంబంధం లేని కేసులో ఇరికించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కేసును కొట్టి వేయడంతో పాటు అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని హరీశ్ రావు కోరారు.