Jupally Krishna Rao: రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్ ది అని ఆరోపించారు. కేసీఆర్ 8 లక్షల కోట్లు అప్పు చేశారని పేర్కొన్నారు. ఇక, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 67 వేల కోట్ల రూపాయలకు అప్పులు కట్టిందని చెప్పుకొచ్చారు.
Read Also: Champions Trophy 2025: తగ్గేదేలే.. పీసీబీ డిమాండ్‌కు బీసీసీఐ కౌంటర్!
కాగా, గతంలో కేసీఆర్ 3 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారు.. రైతులకు రైతు భరోసా ఎకరానికి 10 వేల రూపాయలను త్వరలో ఇస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఇక, జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తాం.. ప్రజలు ప్రతి పక్షాల మాటలు నమ్మొద్దు అని కోరారు. కల్వకుర్తి అభివృద్ధిలో తన వంతు కృషి చేస్తానని మంత్రి చెప్పుకొచ్చారు. అయితే, ఆమనగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా యాట గీత నరసింహ ముదిరాజ్, వైస్ చైర్మన్ గా గూడూరు భాస్కర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, రాజేష్ రెడ్డిలు పాల్గొన్నారు.