S. Jaishankar: పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయంలో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ మాట్లాడుతూ.. గాజా సమస్యకు ‘ద్విదేశ’ పరిష్కారానికి తాము మద్దతు ఇస్తామని తెలిపారు.
Telangana Assembly: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఖరారయ్యాయి. డిసెంబర్ 9వ తేదీ నుంచి అసెంబ్లీ సెషన్స్ ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10.30 గంటలకు శాసన సభ, శాసన మండలి సమావేశాలు స్టార్ట్ కానున్నాయి.
Medicine: తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దుల్లోని చెత్తకుప్పలో తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేసే మెడిసిన్ దర్శనమిస్తుంది. తెలంగాణ సర్కార్ పంపిణీ చేసిన మందులు, మాత్రలు తదితర వైద్య సామాగ్రిని మహారాష్ట్రలోని లకడ్ కోట గ్రామ సమీపంలో రోడ్డు పక్కన పడేశారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని గాలికొదిలేసిందన్నారు. పెద్దపల్లిలో రూ.1500 కోట్ల అభివృద్ధి చేశాం.. ఒక్క ఏడాదిలో 56 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.. మరికొన్ని నియామకాలు ఇప్పటికి కొనసాగుతున్నాయన్నారు.
గత ప్రభుత్వం చేయని పనులను మనం చేసుకునే అవకాశం వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రోజు డిపార్ట్మెంట్ల వారిగా రూ. 1035 కోట్ల పనులను మంజూరు చేసుకున్నాం.. ఈ రోజు ఈ ప్రాంతానికి ఇన్ని నిధులతో అభివృద్ధి చేసుకోవడానికి కారణం.. ఆరోజు మీరు పార్లమెంట్ పరిధిలోని అన్ని ఎమ్మెల్యే సెగ్మెంట్లు గెలవడమే అందుకు కారణం అని చెప్పుకొచ్చారు.
TG High Court: బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహెల్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు అయింది. ఈ నెల 16వ తేదీన పంజాగుట్ట పోలీసుల ముందు సాహెల్ హాజరు కావాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
TG Police Dept: హైదరాబాద్ లోని గోషామహల్ పోలీస్ స్టేడియంలో ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్ మెంట్లో ట్రాన్స్ జెండర్ల నియామకాలు కొనసాగుతున్నాయి. తొలిసారిగా సిటీ కమిషనరేట్ పరిధిలో సెలెక్షన్స్ జరిగాయి. గోశామహల్ స్టేడియంలో ట్రాన్స్ జెండర్స్ కి ఈవెంట్స్ నిర్వహించిన అధికారులు.. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పరిశీలించారు.
Wazedu SI Suicide: ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ హరీశ్ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో కీలక విషయాలను పోలీసులు తెలిపారు. ఎస్ఐ హరీశ్ ను ఓ యువతి బ్లాక్ మెయిల్ చేసినట్లు చెప్పుకొచ్చారు.
Google- Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ కంపెనీతో కీలక ఒప్పందం చేసుకుంది. దేశంలోని మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (GSEC)ని హైదరాబాద్లో నెలకొల్పేందుకు గూగుల్ ముందుకొచ్చింది. భాగ్యనగరంలో స్థాపించే సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రపంచంలోనే ఐదవది.