Lagacharla Case: వికారాబాద్ లోని లగచర్లలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి కేసులో A2 నిందితుడు సురేశ్ ను పోలీసులు విచారణ చేస్తున్నారు. రెండు రోజుల కస్టడీలో భాగంగా వికారాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ విచారిస్తున్న పోలీసులు. తాండూర్ డిఎస్పీ బాలకృష్ణారెడ్డి, కొడంగల్ సిఐ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. విచారణకు సురేష్ సహకరించడం లేదని పోలీసులు చెప్తున్నారు. నేటి (డిసెంబర్ 4) తో కస్టడీ ముగియనుంది. ఈ రోజు సాయంత్రం కోర్ట్ ముందు లగచర్ల దాడి కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న సురేశ్ ను హాజరుపర్చనున్నారు. ఆ తర్వాత సంగారెడ్డి జైలుకు సురేశ్ ను తరలించునున్నారు పోలీసులు.