Harish Rao: ఫోన్ టాపింగ్ ఆరోపణలు, బెదిరింపులకు పాల్పడిన వ్యవహారాలపై మాజీమంత్రి హరీష్ రావుపై కేసు నమోదు అయింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో డిసెంబర్ 1వ తేదీన కేసు నమోదు చేసిన పోలీసులు.. 409, 386తో పాటు ఐటీ యాక్ట్ 66 కింద కేసు నమోదు చేశారు. బాచుపల్లికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఇక, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై.. 120 (b), 386, 409, ఐటీ యాక్ట్ 2008 కింద కేసులు నమోదు చేశారు. తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారని రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆరోపించారు. తన ఫోన్ ట్యాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.