PM Modi- Stalin: తమిళనాడులోని విల్లుపురం, సేలం, తిరువన్నమలై, కడలూరులో ఫెంగల్ తుఫాన్ ధాటికి వరద బీభత్సం సృష్టిస్తుంది. ఈ వరదలకు ఊర్లకు ఊర్లో మునిగిపోయాయి. కోయంబత్తూరు నుంచి బెంగళూరుకు, సేలం నుంచి బెంగళూరుకు.. విల్లుపురం నుంచి బెంగళూరు- చెన్నై వెళ్లే జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తుంది. 8 గంటలుగా ఆయా జాతీయ రహదారులపై వేలాదిగా నిలిచిపోయిన వాహనాలు. కాగా, వాహనాలు గంటల తరబడి నిలిచిపోవడంతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Read Also: Jailer 2 : జైలర్ ను మించి జైలర్ 2లో స్పెషల్ అట్రాక్షన్స్
ఇక, ఆహారాన్ని అందించాలంటూ జాతీయ రహదారిపై ప్రయాణికులు ధర్నాకు దిగారు. మూడు రోజులుగా నీటలో ఉన్న సేలం, విల్లుపురం బస్టాండ్ లు.. వరదల కారణంగా లోతట్టు కాలనీల్లో ఇంకా పూర్తిస్థాయిలో కొనసాగని సహాయక చర్యలు. ఒకటిన్నర రోజుగా వరదలోనే మూడు జిల్లాల్లోని వేలాది మంది కుటుంబాలు ఉండిపోయాయి. ఇక, మరోవైపు.. తమిళనాడు సీఎం స్టాలిన్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో వరదల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. తమిళనాడుకు సహాయ, సహకారాలు అందిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.