High Tension: మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడలో గల నారాయణ కళాశాల యజమాన్యం మూడు రోజుల సెలవులు ప్రకటించారు. కాలేజ్ దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
TG High Court: ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం ఎన్కౌంటర్లో మరణించిన ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను ఈరోజు (డిసెంబర్ 3) వరకు ఏటూరునాగారంలోని ఆస్పత్రిలోనే భద్రపర్చాలని పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
CM Revanth Reddy: ప్రజా పాలన విజయోత్సవంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హై సిటీ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. దాదాపు రూ. 3667 కోట్ల విలువైన అభివృద్ధి పనులను శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
Chevella Accident: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని ఆలూరు గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుకు ఇరువైపులా కూరగాయలు అమ్ముతున్న రైతులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో మరణించిన నక్కలపల్లి రాములు, దామరగిద్ధ కృష్ణ, శ్యామల సుజాత, జమీల్ అనే నలుగురు మృదేహాలకు చేవెళ్ల టౌన్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం చేయనున్నారు.
తమిళనాడులో రాష్ట్రంలో ఫెంగల్ తుఫాన్ ఘోర విషాదం నింపింది. భారీ వర్షాల ధాటికి 18 మంది మృతి చెందారు. తుఫాన్ వల్ల కురిసిన భారీ వర్షాలకు తిరువన్నమలైలో కొండ చరియలు విరిగిపడ్డాయి పలు ఇళ్లపై.. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు.
Bangladesh ISKCON: బంగ్లాదేశ్‌లో దేశద్రోహం ఆరోపణలపై అరెస్టైన ప్రచారకర్త చిన్మయ్ కృష్ణ దాస్ తరపు లాయర్ రమణ్ రాయ్‌పై దాడి జరగడంపై ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ (ఇస్కాన్) స్పందించింది. ఇస్కాన్ ప్రతినిధి రాధా రమణ్ దాస్ ట్విట్టర్లో చేసిన పోస్ట్‌లో ‘దయచేసి అడ్వకేట్ రమణ్ రాయ్ కోసం ప్రార్థనలు చేయండిని కోరారు.
TS High Court: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల, హాస్టల్స్ లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఫుడ్ పాయిజన్ తో మృతి చెందిన శైలజ, ప్రవీణ్ ఘటనలపై పూర్తి వివరాలను న్యాయస్థానానికి పిటిషనర్ చిక్కుడు ప్రభాకర్ అందజేశారు.
Hyderabad: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో మహిళ కానిస్టేబుల్ నాగమణిని ఆమె తమ్ముడు దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటనపై Ntvతో మృతురాలు భర్త శ్రీకాంత్ మాట్లాడుతూ.. పరమేశ్ తమను చంపుతాడని తెలుసు.. కులంతర వివాహం చేసుకోవడంతోనే అతను నాగమణిపై కక్ష్య పెంచుకున్నాడని పేర్కొన్నాడు.
MLC Jeevan Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏడాది ఉత్సవాలను చేస్తుంటే.. కాంగ్రెస్ పాలన చూసి బీజేపీ ఓర్వలేక పోతుందని విమర్శించారు.