IND vs BAN: ఛాంపియన్స్ ట్రోఫీలో తమ మొదటి మ్యాచ్ ను బంగ్లాదేశ్ తో భారత్ దుబాయ్ వేదికగా తలపడబోతుంది. ఇక, తమ తొలి మ్యాచ్‌లో ఈ రోజు (ఫిబ్రవరి 20) బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడుతుంది.
Karnataka: ప్రేమించి, అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచి 12 ఏళ్ల పాటు కాపురం చేసిన ఓ జంట. అయితే, ఆ వివాహిత మరొకరి మీద మోజుపడి కట్టుకున్నోడికి తీరని అన్యాయం చేసింది. అంతే, భర్త గుండె పగిలి ప్రాణాలు తీసుకున్నాడు. తన స్నేహితుడే భార్యను లేపుకెళ్లాడంతో జీవితంపై విరక్తి చెందిన ఆ భర్త సెల్ఫీ వీడియో తీసుకుని.. తన చావుకు పరారైన భార్య, స్నేహితుడే కారణమని వెల్లడించాడు.
Udayanidhi Stalin: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఈసారి ఏకంగా కేంద్ర ప్రభుత్వంపై తనదైన శైలిలో మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన సమగ్ర శిక్ష అభియాన్ కి వచ్చే 2190 కోట్ల రూపాయల నిధులు తామేమీ అడుక్కోవడం లేదని పేర్కొన్నారు. మీ అయ్యా సొమ్ము ఏం అడగడం లేదని విమర్శలు గుప్పించారు.
India vs Pakistan: అంతర్జాతీయ వేదికలపై భారత్‌పై అక్కసు వెళ్లగక్కడం పాకిస్థాన్‌కు మొదటి నుంచి ఉన్న అలవాటు. అయితే, చైనా అధ్యక్షతన జరిగిన భద్రతా మండలి సమావేశంలో జమ్మూ కశ్మీర్‌ను ఉద్దేశించి పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఇషక్ దార్ హాట్ కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలకు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీస్ ఘాటుగా బదులిచ్చారు. యూఎన్ ఉగ్రవాద సంస్థల జాబితాలో ఉన్న 20 సంస్థలను దాయాది దేశం పాక్ పెంచి పోషిస్తోంది అని ఆరోపించారు.
Delhi New CM Oath: దేశ రాజధాని కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించి రాంలీలా మైదానం ముస్తాబైంది. ఏర్పాట్లను భారతీయ జనతా పార్టీ పూర్తి చేసింది. భద్రతా కారణాలతో గ్రౌండ్ ను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ హస్తగతం చేసుకుంది. రేపు మధ్యాహ్నం 12. 05 గంటలకు సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.
Union Government: గత ఏడాది సంభవించిన విపత్తులు, వరదలకు సంబంధించిన సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఈరోజు (ఫిబ్రవరి 19) ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఐదు రాష్ట్రాలకు రూ.1554.99 కోట్ల అదనపు సాయాన్ని ఆమోదించింది.
Shivaji Maharaj Jayanti: మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించి, ధర్మ స్థాపన కోసం సామ్రాజ్యం స్థాపించిన గొప్ప యోధుడు ఛత్రపతి శివాజీ 395వ జయంతి నేడు. అయితే, ఛత్రపతి శివాజీ తెలుగు నేలపై నడయాడినట్లు తెలుస్తుంది.
Assam Congress: వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఈశాన్య రాష్ట్రం అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడిగా లోక్‌సభ సభ్యుడు గౌరవ్ గొగోయ్‌ను నియమించాలని కోరుతూ ఆ పార్టీ సీనియర్ నాయకుల బృందం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాసింది. ఇదే విషయాన్ని ఇప్పటికే సోనియా, రాహుల్ గాంధీలతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు కూడా తెలియజేశారు.
కరాచీ స్టేడియంలో చోటు చేసుకున్న ఓ ఘటన వివాదానికి దారి తీసింది. దీంతో భారత జాతీయ జెండాను ఆ స్టేడియంలో ప్రదర్శించకపోవడంతో పాక్ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దెబ్బకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు దిగొచ్చింది. ఇక, దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆ స్టేడియంలో ఇండియన్ ఫ్లాగ్ ను ప్రదర్శించింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి.
Rajasthan: రాజస్థాన్‌లోని బీవర్ జిల్లాలో మైనర్ బాలికలను లైంగికంగా వేధించి, బలవంతంగా మతం మార్చడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై ఏడుగురు ముస్లిం యువకులను పోలీసులు అరెస్టు చేశారు.