Supreme Court: హైకోర్టు న్యాయమూర్తులను విచారించే అధికారం తమకు ఉందంటూ లోక్పాల్ జారీ చేసిన ఉత్తర్వులపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ఆ ఉత్తర్వులు ఆందోళనకరంగా ఉందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
Delhi CM Rekha Gupta: ఢిల్లీ 4వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్త ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం రాంలీలా మైదానంలో ఘనంగా జరిగింది. మధ్యాహ్నం 12:35 గంటలకి లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె సీఎం పదవిని చేపట్టారు. రామ్లీలా మైదానంలో ప్రజల సమక్షంలో రేఖా గుప్తా పట్టాభిషేక కార్యక్రమం జరిగింది.
Delhi Assembly speaker: ఢిల్లీలో 26 ఏళ్ల తర్వాత ప్రభుత్వా్న్ని ఏర్పాటు చేస్తున్న బీజేపీ.. అసెంబ్లీ స్పీకర్ పదవికి భారతీయ జనతా పార్టీ తరపున రోహిణి ఎమ్మెల్యే విజేందర్ గుప్తా నామినేట్ అయ్యారని పార్టీ నాయకులు తెలిపారు.
Rekha Gupta: అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఢిల్లీలో శీష్ మహల్ పేరు బాగా వినిపించింది. ఇప్పుడు ఆ భవనాన్ని మ్యూజియంగా మారుస్తామని ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలన్నీ త్వరలోనే నెరవేరుస్తాం..
Kashmiri MBBS Student: కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్లో గల అల్-అమీన్ మెడికల్ కాలేజీలో చదువుతున్న కాశ్మీర్లోని అనంత్నాగ్కు చెందిన సెకండ్ ఇయర్ MBBS విద్యార్థినిపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేయడంతో పాటు దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. దీనిపై సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ సంఘటనచడ జమ్మూ కాశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ స్పందించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నిర్ణయం సరైంది కాదు అని పేర్కొన్నారు. మస్క్ పక్కన ఉండగానే అమెరికా అధ్యక్షుడు ఈ కామెంట్స్ చేయడం గమనార్హం. ఈ ప్రపంచంలోని ప్రతి దేశం మమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తోంది అని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు.
Delhi Cabinet Ministers: ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఈ రోజు (ఫిబ్రవరి 20) రేఖ గుప్తా రాంలీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాజాగా, ఆమెతో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణ చేయనున్నట్లు తెలుస్తుంది.
Donald Trump: ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఓ నియంత.. అందుకే ఆ దేశంలో ఎన్నికలు జరపడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డాడు. రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే కీవ్ వాదనను తప్పుబట్టారు. కాస్త భూమితో పోయేదాన్ని యుద్ధం వరకూ తెచ్చారని విమర్శించాడు.
ఈరోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఎన్డీయే నేతల సమక్షంలో రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, ఆతిశీ మర్లేనా తర్వాత ఢిల్లీ సీఎం పీఠాన్ని అధిరోహించబోతున్న నాలుగో మహిళగా ఆమె నిలవనుంది.