Congress: హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా భారీ పునర్వ్యవస్థీకరణ చేసింది. సామాజిక న్యాయం అనే నినాదం కాంగ్రెస్ పార్టీపై బలమైన ముద్ర వేసింది.
Akali Dal Crisis: భారతదేశంలోని గురుద్వారాల నిర్వహణకు బాధ్యత వహించే సంస్థ శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు హర్జిందర్ సింగ్ ధామి సోమవారం నాడు తన పదవికి రాజీనామా చేశారు. సిక్కుల అత్యున్నత తాత్కాలిక అధికారం అయిన అకల్ తఖ్త్కు తాను కట్టుబడి ఉన్నానని ధామి చెప్పారు.
చిక్కీలో అధిక అసంతృప్త కొవ్వులు, అధిక చక్కెర కంటెంట్ ఉండటం వల్ల పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. వెంటనే దీన్ని నిలిపివేయాలని సిద్ధరామయ్య సర్కార్ ఆదేశించింది. మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలల్లో చిక్కీకి బదులుగా గుడ్లు లేదా అరటి పండ్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ICC Champions Trophy 2025: ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రేపటి నుంచి ప్రారంభం కానుంది. కరాచీలో జరిగే మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ పాకిస్తాన్- న్యూజిలాండ్తో తలపడటంతో టోర్నమెంట్ ప్రారంభమవుతుంది.
Delta Plane Crash: కెనడాలో మరో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం నాడు టొరంటోలోని పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డెల్టా ఎయిర్లైన్స్కు చెందిన విమానం.. ల్యాండ్ అయిన తర్వాత అదుపు తప్పి బోల్తా పడింది.
New CEC Gyanesh Kumar: ప్రస్తుతం ఎన్నికల కమిషనర్గా ఉన్న జ్ఞానేశ్ కుమార్.. భారత 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా ఎంపికయ్యారు. అతడి స్థానంలో ఎన్నికల కమిషనర్గా.. ప్రస్తుతం హర్యానా సీఎస్ గా విధులు నిర్వర్తిస్తున్న వివేక్ జోషి (1989 బ్యాచ్ ఐఏఎస్)ని నియమించారు.
Russia- America: ఉక్రెయిన్- రష్యా యుద్ధం ప్రారంభమై నేటికి సుమారు మూడేళ్లు పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పడానికి ఈ రోజు (ఫిబ్రవరి 18) సౌదీ అరేబియా వేదికగా కీలక సమావేశం జరగబోతుంది.
Bird Flu Outbreak In US: బర్డ్ ప్లూ అనేది కేవలం భారతదేశంలోనే కాదు అగ్రరాజ్యం అమెరికానూ సైతం భయపెడుతుంది. ఒకవైపు, బర్డ్ ఫ్లూ వల్ల మన దేశంలో చికెన్, గుడ్లు తినాలంటే ప్రజలు భయపడుతున్నారు. దీంతో చికెన్, గుడ్ల అమ్మకాలు అమాంతం పడిపోయాయి. అలాగే, అమెరికాలో ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో కోడిగుడ్ల ధరలు రోజు రోజుకు కొండెక్కుతున్నాయి.
Sam Pitroda: కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ ఛైర్మన్ శ్యామ్ పిట్రోడా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా పట్ల భారతదేశం యొక్క విధానం ఘర్షణాత్మకమైనదని, ఆ మనస్తత్వాన్ని కాంగ్రెస్ పార్టీ మార్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డ్రాగన్ కంట్రీ నుంచి వచ్చే ముప్పు ఏంటో నాకు అర్థం కావడం లేదన్నారు.
కంపెనీ ఐదు రోజుల రిటర్న్-టు-ఆఫీస్ (RTO) పని విధానాన్ని పునఃపరిశీలించాలని ఉద్యోగులు చేసిన వినతులను జేపీ మోర్గాన్ చేజ్ సీఈవో జామీ డిమోన్ తిరస్కరించారు. ఉద్యోగులు వేసిన అంతర్గత పిటిషన్ను అతడు తోసిపుచ్చారు. దానిపై సమయం వృథా చేయకండి.. ఆ ఫకింగ్ పిటిషన్పై ఎంత మంది సంతకం చేశారనేది నాకు ముఖ్యం కాదు అని చెప్పుకొచ్చారు.