Delhi New CM Oath: దేశ రాజధాని కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించి రాంలీలా మైదానం ముస్తాబైంది. ఏర్పాట్లను భారతీయ జనతా పార్టీ పూర్తి చేసింది. భద్రతా కారణాలతో గ్రౌండ్ ను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ హస్తగతం చేసుకుంది. రేపు మధ్యాహ్నం 12. 05 గంటలకు సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కొత్త సీఎం చేత చేయించనున్నారు. రాంలీలా మైదానంలో సుమారు 30 వేల మంది కూర్చునేందుకు వీలుగా సీటింగ్ ఏర్పాటు చేశారు. అలాగే, మూడు పెద్ద స్టేజీలతో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేయగా.. మెయిన్ స్టేజీ మీద ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ సీఎం కూర్చోనున్నారు.
Read Also: Guntur Mirchi Yard: వైఎస్ జగన్ వచ్చిన సమయంలో తోపులాట.. మిర్చి యార్డ్‌లో 14 మిర్చి టిక్కీలు మాయం!
అలాగే, సెకండ్ స్టేజీపై మత పెద్దల కోసం ఏర్పాటు చేయగా.. ఢిల్లీకి చెందిన ప్రస్తుత ఎంపీలు, ఎన్నికైన ఎమ్మెల్యేలు మూడవ వేదికపై కూర్చుంటారు. గురువారం ఉదయం 11:15 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:25 గంటలకు ప్రమాణోత్సవ కార్యక్రమం క్లోజ్ కానుంది. ఈ ఈవెంట్ కు సినీ తారలు, ఇతర వీఐపీలకు సీటింగ్ ఏర్పాట్లు చేశారు. అయితే, ఈరోజు మధ్యాహ్నం బీజేఎల్పీ సమావేశం కాబోతుంది. బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఎల్పీని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. దీంతో ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై క్లారిటీ వస్తుంది. ఈ భేటీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు ఢిల్లీ బీజేపీ ఎంపీలు కూడా పాల్గొనే అవకాశం ఉంది. బీజేఎల్పీ నేత ఎన్నిక తర్వాత లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ను ఎమ్మెల్యేలు అందరు కలవనున్నారు. ఇప్పటికే సీఎం ప్రమాణస్వీకారం కోర్డినేటర్లుగా వినోద్ తావ్డే, తరుణ్ చుగ్‌లను కమలం పార్టీ నియమించింది.