Rajasthan: రాజస్థాన్‌లోని బీవర్ జిల్లాలో మైనర్ బాలికలను లైంగికంగా వేధించి, బలవంతంగా మతం మార్చడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై ఏడుగురు ముస్లిం యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన సోమవారం నాడు బీజై నగర్ పోలీస్ స్టేషన్‌లో ఐదుగురు బాలికల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు లైంగిక దాడి, అత్యాచారం, వేధింపు, పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద సుమారు 7 మంది ముస్లిం యువకులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.
Read Also: CM Chandrababu: వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. బడ్జెట్‌పై కసరత్తు!
ఇక, కొంతమంది ముస్లీం యువకులు తమకు చైనీస్ మొబైల్ ఫోన్లు ఇచ్చి లైంగిక దాడి చేసి మత మార్పిడికి బలవంతం చేస్తున్నారని ఐదుగురు బాలికలు ఫిర్యాదు చేశారు. సదరు మైనర్ బాలికల వాంగ్మూలాలను రికార్డ్ చేసుకున్నామని డీఎస్పీ సజ్జన్ సింగ్ తెలిపారు. నిందితులు సోషల్ మీడియా ద్వారా బాలికలను సంప్రదించి, వారితో మాట్లాడటానికి మొబైల్ ఫోన్లు ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం.. మెజిస్టీరియల్ దర్యాప్తు పెండింగ్‌లో ఉందని డీఎస్సీ వెల్లడించారు.