Bharat Jodo Vivah: భారత్ జోడో యాత్ర పేరుతో దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారు. ఈ భారత్ జోడో యాత్ర స్ఫూర్తిగా భారత్ జోడో వివాహం జరిగింది. భారత్ జోడో పోస్టర్ లా భారత్ జోడో వివాహ ఆహ్వాన పత్రికను ముద్రించింది ఓ యువ జంట.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వ్యాఖ్యలకు తాత్కాలిక దేశాధినేత మహ్మద్ యూనస్ స్పందించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాన మంత్రిని భారతదేశం నుంచి రప్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. ఆమెను బంగ్లాకు అప్పగించడానికి మేము అనేక ప్రయత్నాలు చేస్తున్నాం.. హసీనాను వ్యక్తిగతంగా విచారించడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. అసలు ‘ఇండియాకు 21 మిలియన్ డాలర్ల సాయం ఎందుకివ్వాలి అని ప్రశ్నించారు. వాళ్ల దగ్గరే చాలా డబ్బులు ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికాపై వాళ్లు భారీగా ట్యాక్సులు వేస్తున్నారని ఆరోపించాడు. నాకు భారత దేశం అన్నా, ఆ దేశ ప్రధాని అన్నా గౌరవం ఉంది అని చెప్పుకొచ్చాడు.
Union Cabinet: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ రోజు (ఫిబ్రవరి 19) కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ భేటీలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని టాక్.
Champions Trophy 2025: ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఈరోజు (ఫిబ్రవరి 19) నుంచి ప్రారంభం కానుంది. కరాచీ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ పాకిస్తాన్- న్యూజిలాండ్‌తో తలపడటంతో టోర్నమెంట్ ప్రారంభమవుతుంది.
Cognizant: ప్రముఖ ఐటీ సంస్థలైన కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్‌ల మధ్య వివాదం కొనసాగుతోంది. అమెరికన్ న్యాయస్థానంలో పిటిషన్ వేసిన ఈ ఇరు సంస్థలు గత కొంతకాలంగా పోరాటం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్‌పై కాగ్నిజెంట్ ఆరోపణలు చేసింది.
BCCI: ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఘోర ఓటమి తర్వాత ప్లేయర్స్, స్టాఫ్‌కు సంబంధించి బీసీసీఐ కఠిన నిబంధనలు విధించింది. ఇకపై క్రికెటర్లు తమ భాగస్వాములు, ఫ్యామిలిని వెంట తీసుకెళ్లడం సహా పలు సౌకర్యాల విషయంలో ఆంక్షలు పెట్టింది.
BAN vs IND: ఒమన్‌లోని మస్కట్‌లో జరిగిన 8వ హిందూ మహాసముద్ర సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ విదేశాంగ సలహాదారు తౌహిద్ హుస్సేన్ కీలక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత్- పాకిస్తాన్ మధ్య వివాదంతో చాలా కాలంగా సార్క్ పునరుద్ధరణపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.
Maharashtra: మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమిలో చీలికలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హోం శాఖ మంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన 20 మంది ఎమ్మెల్యేలకు ఉన్న వై కేటగిరి సెక్యూరిటీని ఉపసంహరించుకున్నట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు.
టీమిండియా జెర్సీలపై పాక్ పేరును తొలగించాలంటూ గతంలో పలువురు క్రికెట్ అభిమానులు డిమాండ్ చేసినప్పటికీ.. బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. టోర్నీ సమయంలో క్రికెట్ బోర్డు, భారత జట్టు.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆదేశాలకు కట్టుబడి ఉంటుందని తేల్చి చెప్పారు.