Siddhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ అంటేనే ఒక వైవిధ్యమైన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్లకు కేరాఫ్ అడ్రస్ అనే చెప్పాలి. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ స్టార్ బాయ్ తదుపరి ప్రాజెక్టుల విషయంలో సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అయితే, తాజాగా సిద్ధు ఒక క్రేజీ డైరెక్టర్‌తో జతకట్టబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సిద్ధు జొన్నలగడ్డ – దర్శకుడు రవికాంత్ పేరెపు (క్షణం, కృష్ణ అండ్ హిస్ లీలా ఫేమ్) కాంబినేషన్‌లో గతంలో ‘కోహినూర్’ అనే రెండు భాగాల సినిమా అనౌన్స్ అయ్యింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత అదే కాంబోలో ‘బాడాస్’ అనే ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది కానీ, అనూహ్యంగా ఈ సినిమా కూడా ప్రస్తుతం హోల్డ్‌లో పడినట్లు సమాచారం.
రవికాంత్ ప్రాజెక్ట్ పక్కన పెట్టడంతో, సిద్ధు ఇప్పుడు ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి కల్ట్ హిట్ అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్జేతో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. స్వరూప్, సిద్ధు కోసం ఒక విభిన్నమైన కథను సిద్ధం చేశారనీ, తనదైన మార్క్ హ్యూమర్ అండ్ సస్పెన్స్‌తో స్వరూప్ ఈ చిత్రాన్ని మలచబోతున్నట్లు టాక్. ఈ క్రేజీ కాంబినేషన్‌ను కూడా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనుంది అని అంటున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో రానున్న ఈ చిత్రం ఒక ‘యూనిక్ ఎంటర్‌టైనర్’గా ఉండబోతోంది అని తెలుస్తోంది. సిద్ధు బాడీ లాంగ్వేజ్‌కు, స్వరూప్ టేకింగ్‌కు సరిగ్గా సరిపోయే స్క్రిప్ట్ కావడంతో మెగా అనౌన్స్‌మెంట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
READ ALSO: TG Assembly: నమస్కారం సార్..బాగున్నారా ? ఆరోగ్యం బాగుందా ? అని కేసీఆర్‌ను పలకరించిన సీఎం రేవంత్.!