India vs Pakistan: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని పాకిస్థాన్ చెప్పడం హాస్యాస్పదం
- మరోసారి అంతర్జాతీయ వేదిక మీద భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన పాకిస్థాన్..
- జమ్మూకశ్మీర్ తమదేనని ప్రకటించిన పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఇషక్ దార్..
- పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషక్ దార్ పై తీవ్రంగా మండిపడిన భారత ప్రతినిధి..
- జమ్మూకశ్మీర్ ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమే: భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan: అంతర్జాతీయ వేదికలపై భారత్‌పై అక్కసు వెళ్లగక్కడం పాకిస్థాన్‌కు మొదటి నుంచి ఉన్న అలవాటు. అయితే, చైనా అధ్యక్షతన జరిగిన భద్రతా మండలి సమావేశంలో జమ్మూ కశ్మీర్‌ను ఉద్దేశించి పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఇషక్ దార్ హాట్ కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలకు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీస్ ఘాటుగా బదులిచ్చారు. యూఎన్ ఉగ్రవాద సంస్థల జాబితాలో ఉన్న 20 సంస్థలను దాయాది దేశం పాక్ పెంచి పోషిస్తోంది అని ఆరోపించారు. అలాగే, సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోయడంతో పాటు ఉగ్రవాద వ్యతిరేక పోరులో ముందు వరుసలో ఉందని పాకిస్థాన్ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. పాక్ చేసే ఉగ్ర కార్యకలాపాలకు మేం బాధితులం అయ్యామని పేర్కొన్నారు. అమాయక ప్రజలపై జరిగే ఉగ్రవాద చర్యలకు సమర్థించలేమన్నారు. ఉగ్రవాదుల్లో మంచి, చెడు అని తేడాలు ఉండవని చెప్పుకొచ్చారు. ఇలాంటి మాటలతో భద్రతా మండలి సమయాన్ని వృథా చేయొద్దని పాక్ మంత్రికి భారత ప్రతినిధి హరీస్ హితవు పలికారు.
Read Also: Komatireddy Venkat Reddy: ఓట్ల కోసం దేశాన్ని విడగొట్టే పార్టీ బీజేపీ
Also Read
- Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
- Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
అయితే, జమ్మూకశ్మీర్ ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమేనని భద్రతా మండిలిలో పర్వతనేని హరీస్ తేల్చి చెప్పారు. గత కొన్ని నెలల క్రితం జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్నికలతో పాటు కొత్త ప్రభుత్వం ఏర్పడటం గురించి తెలియజేశారు. కశ్మీర్ ప్రజల ఎంపిక చాలా క్లీయర్ గా ఉంది. పాకిస్థాన్ మాదిరిగా కాకుండా అక్కడ ప్రజాస్వామ్యం బలంగా పరిణవిల్లుతుంది అన్నారు. కశ్మీర్ అంశానికి సంబంధించి పాకిస్థాన్ తన మొండి వాదనను ఆపివేయాలని హెచ్చరించారు. కశ్మీరీలు తమ ప్రజాస్వామ్య హక్కులు వినియోగించుకోవడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను భారత్ అమలు చేయాలని పాకిస్థాన్ కోరింది. ఇందులో భాగంగానే, కశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణకు అనుమతించాలని కోరుతూ పాక్ పార్లమెంట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
తాజావార్తలు
-
Varanasi : ‘వారణాసి’లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
-
Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 లాంచ్.. 200MP కెమెరా, Gemini AI, Bang & Olufsen ఆడియో ఫీచర్స్
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
ట్రెండింగ్
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!