Ragging Cases: కేరళ రాష్ట్రంలో ర్యాగింగ్ కేసులు పెరుగుదలపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ర్యాగింగ్ సంఘటనలపై కఠినమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ కేరళ లీగల్ సర్వీసెస్ అథారిటీ (కేఎల్ఎస్ఎ) దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంకు ప్రతిస్పందనగా చీఫ్ జస్టిస్ నితిన్ జామ్దార్, జస్టిస్ ఎస్ మనులతో కూడిన డివిజన్ బెంచ్.. యాంటీ ర్యాగింగ్ సెల్స్ ఏర్పాటుకు తీసుకున్న చర్యల గురించి న్యాయస్థానానికి తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Read Also: Ambulance Misuse: కుక్క కోసం సైరన్‌తో అంబులెన్స్.. ఆశ్చర్యపోయిన ట్రాఫిక్ పోలీసులు
ఇక, తన సిఫార్సులలో భాగంగా, ప్రభుత్వం, న్యాయ సేవా సంస్థలు, పౌర సమాజం నుంచి ప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో సహా, రాష్ట్ర, జిల్లా స్థాయిలో ర్యాగింగ్ నిరోధక పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని పిటిషనర్ ప్రతిపాదించారు. ఈ కమిటీలు ర్యాగింగ్ నిరోధక మార్గదర్శకాలు, నిబంధనలు, న్యాయపరమైన ఆదేశాల అమలును నిర్ధారించే బాధ్యతను కలిగి ఉంటాయన్నారు. దీంతో పాటు విద్యాసంస్థలు, ప్రభుత్వ విభాగాలు రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీకి పురోగతి నివేదికలను సమర్పించాలని కూడా కేరళ హైకోర్టు ఆదేశించింది. అలాగే, స్టూడెంట్స్ లలో వేధింపులను అరికట్టడానికి పాఠశాలల్లో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. విద్యా సంస్థల్లో సురక్షితమైన వాతావరణాన్ని నిర్ధారించడానికి కఠినమైన చట్టాలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ర్యాగింగ్ నిరోధక నిబంధనలను మరింత బలోపేతం చేయాలని పిటిషనర్ కోరారు. ఈ కేసు ఇప్పుడు హైకోర్టు పరిశీలనలో ఉంది.. రాబోయే రోజుల్లో మరిన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.