Supreme Court: రాష్ట్రాల నిర్లక్ష్యం.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పెరిగిన ఔషధాల ధరలు
- ప్రైవేట్ ఆసుపత్రులలో పెరిగిన మందుల ధరలపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
- ప్రైవేట్ ఆసుపత్రుల్లో ధరలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి..
- రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కారణంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఔషధాల ధరలు పెరిగాయి: సుప్రీం కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: అందుబాటు ధరల్లో వైద్య సంరక్షణ, సదుపాయాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయని సుప్రీంకోర్టు మండిపడింది. స్టేట్ గవర్నమెంట్స్ వైఫల్యమే ప్రైవేటు ఆస్పత్రులకు ప్రోత్సాహకంగా మారింది.. ప్రైవేట్ హస్పటల్స్ అన్నీ రోగులు, వారి బంధువుల నుంచి బలవంతంగా అధిక ధరలతో కూడిన మందులను కొనుగోలు చేయిస్తున్నాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై తాజాగా సుప్రీంలో విచారణ జరిపింది. తమ ఫార్మసీల నుంచే మెడిసిన్ కొనుగోలు చేయాలని రోగులను బలవంతం చేయొద్దని ప్రైవేట్ ఆసుపత్రులకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ వేడుకున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులపై నియంత్రణ చర్యలు తీసుకోవడంలో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడంతో రోగులు దోపిడీకి గురవుతున్నారని చెప్పుకొచ్చాడు. ఇక, పిటిషనర్ వాదనతో ఏకీభవించిన సుప్రీం ధర్మాసనం.. రోగులకు సూచించిన ఔషధం వేరే చోట తక్కువ ధరకు దొరుకుతున్నప్పుడు.. దానిని తమ ఫార్మసీలోనే కొనుగోలు చేయాలని ప్రైవేటు హస్పటల్స్ బలవంతం చేయకుండా చూడాలని రాష్ట్రాలకు సూచించింది.
Read Also: Navneet Kaur: మహారాష్ట్ర నుంచి ఔరంగజేబు సమాధిని తొలగించండి..
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
ఇక, సమాజంలోని పేద వర్గాలకు ప్రాణాధార మెడిసిన్ అందుబాటు ధరల్లో లభించడం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. పౌరులు ఈ రకమైన దోపిడికీ గురి కాకుండా రక్షించేందుకు తగిన మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అత్యుతున్న న్యాయస్థానం ఆదేశించింది. కాగా, ఇదే విషయమై గతంలో సుప్రీంకోర్టు పలు రాష్ట్రాలకు సైతం నోటీసులు ఇచ్చింది. సుప్రీం నోటీసులకు తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలు స్పందించాయి. కౌంటర్ అఫిడవిట్‌ను కూడా దాఖలు చేశాయి. కేంద్రం ఇచ్చిన ధరల నియంత్రణ ఆదేశాలపైనే తాము ఆధారపడతామన్నాయి. అత్యవసర మెడిసిన్ అందుబాటు రేటులో లభించేలా వాటి ధరలను నిర్ణయించినట్లు వెల్లడించాయి.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!