DK Shivakumar: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సీఎం పదవి స్వీకరిస్తారంటూ గత కొంత కాలంగా జోరుగా ప్రచారం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో సమావేశం కావడం తీవ్ర చర్చకు దారి తీసింది. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై ఊహగానాలు వెల్లువెత్తాయి. అయితే, ఖర్గేతో తన సమావేశం ప్రోటోకాల్‌కు సంబంధించిన అంశమని డీకే తెలిపారు. ఆయన మా పార్టీ అధ్యక్షుడు.. ప్రోటోకాల్ ప్రకారం అతడ్ని నేను రిసీవ్ చేసుకోవాల్సి ఉందన్నారు. అందుకే ఖర్గేను కలిశాను.. బెంగళూరులో పార్టీ కొత్త ఆఫీసు శంకుస్థాపన కోసం ఆయనను ఆహ్వానించాం.. ఈ సందర్భంగా ఆయనతో చాలా విషయాలపై చర్చించాను అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివ కుమార్ చెప్పుకొచ్చారు.
Read Also: Bihar: అసెంబ్లీలో తేజస్వీ యాదవ్-నితీష్ కుమార్ మధ్య మాటల యుద్ధం.. హాట్‌హాట్‌గా అసెంబ్లీ సమావేశాలు
ఇక, కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే బాధ్యతలు స్వీకరిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ కీలక వ్యాఖ్యలు చేశారు. డీకే సీఎం కావడం ఖాయం.. దీన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. అతడ్ని సీఎం పదవి చేపట్టడం అనేది కాలపరిమితితో కూడుకున్నది.. అయితే అది కచ్చితంగా జరుగుతుందని చెప్పాడు. కాగా, వీరప్ప మొయిల్ వ్యాఖ్యలపై డీకే శివకుమార్ రియాక్ట్ అయ్యారు. ఈ ప్రకటనలు ఆయన వ్యక్తిగతం.. ఖర్గే నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. అయినప్పటికీ.. వీరప్ప చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయాయి. అలాగే, వీరప్ప వ్యాఖ్యలపై స్పందించిన కేఎన్ రాజన్న.. ఇది కేవలం అతడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.. దీనిపై హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు.