Navneet Kaur: మొఘల్స్ ఆఖరి చక్రవర్తి ఔరంగజేబు దేవాలయాలను నిర్మించాడని, క్రూరమైనవాడు కాదని మహారాష్ట్రలోని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అబూ అజ్మీ ప్రశంసించారు. దీంతో ఆ కామెంట్స్ వివాదానికి దారితీసింది. ఇక, ఎస్పీ చీఫ్ పై బీజేపీ నేత, మాజీ ఎంపీ నవనీత్ కౌర్ రాణా తీవ్ర విమర్శలు గుప్పించారు. మీరు అసెంబ్లీకి ఎన్నికైన రాష్ట్రాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్, ఛత్రపతి శంభాజీ మహారాజ్ పరిపాలించారు.. మీలాంటి వారు ఔరంగజేబు మన శంభాజీ మహారాజ్ ను ఏం చేశాడో చూడటానికి ‘ఛావా’ సినిమా చూడాలి అని పిలుపునిచ్చింది. ఔరంగాబాద్ పేరును మార్చి మన దేవుడు శంభాజీ మహారాజ్ పేరు మీద ఉంచిన విధంగానే.. ఔరంగజేబు సమాధిని కూడా కూల్చివేయాలని నేను మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను.. ఔరంగజేబును ప్రేమించే వ్యక్తులు తమ ఇళ్లలో అతని సమాధిని నిర్మించుకోవాలని నవనీత్ కౌర్ పేర్కొన్నారు.
Read Also: MLC Elections 2025: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు.. పేరాబత్తుల రాజశేఖరం విజయం..
అలాగే, సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తీవ్రంగా మండిపడ్డారు. ఆ మేఘల్ చక్రవారి ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ను 40 రోజుల పాటు తీవ్రంగా హింసించి.. గోర్లు పీకిన, కళ్ళు పీకిన, చర్మం ఒలిచిన, నాలుకను కత్తిరించిన ఆ ఔరంగజేబును పొగడటం చాలా పెద్ద పాపం అన్నారు. దీనికి అబూ అజ్మీ తక్షణమే క్షమాపణ చెప్పాలని లేదా రాజద్రోహం అభియోగం మోపాలన్నారు.