Yogi Adityanath: ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమాజ్ వాదీ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. భారతదేశ మతపరమైన భావాలతో “ఆటలు” పడుతోందన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు మాతా ప్రసాద్ పాండే తనను “మతతత్వవాది” అని పిలిచినందుకు ఆయన ఈ విధంగా విమర్శించారు. శ్రీరాముడు, కృష్ణుడు, ఆదిశంకరాచార్యులను మూడు మార్గదర్శక ఆదర్శాలుగా గౌరవించినంత కాలం, ఏ శక్తి కూడా మన దేశానికి హాని కలిగించలేదని చెప్పారు. ఈ ముగ్గురు గొప్ప వ్యక్తులు భారతదేశ ఐక్యతకు పునాది వేశారని.. ఈ దేశ ప్రజలు వారిని గౌరవించినంత కాలం, భారతదేశం బలంగా ఉంటుందని యూపీ ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.
Read Also: Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్‌కు షాక్..! వైసీపీ ఎమ్మెల్సీపై వరుస ఫిర్యాదులు..
ఇక, నేటి సమాజ్‌వాదీ పార్టీ సోషలిస్ట్ నాయకుడు రామ్ మనోహర్ లోహియా విలువలు, ఆదర్శాల నుంచి చాలా దూరం పోయిందని యూపీ సీఎం యోగి ఆరోపించారు. మీరు మతపరమైన భావాలతో ఆడుకుంటున్నారు.. మా ఆలోచనను మతపరమైనది అని పిలుస్తున్నారు.. ఇది మతపరమైనది ఎలా అవుతుంది?.. మేము అందరికీ సమగ్ర అభివృద్ధిని అందిస్తున్నాం.. మా మార్గదర్శక సూత్రం ‘సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః’ (అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ అరోగ్యంగా ఉండాలి) అని సీఎం ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.