Zee Awards : రెండు దశాబ్దాల విజయవంతమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న జీ తెలుగు ఛానల్, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా తమ ప్రతిష్ఠాత్మక జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2025 వేడుకను ఘనంగా నిర్వహించనుంది. ఈ ఏడాది ‘వసుధైవ కుటుంబం’ నేపథ్యంతో మరింత వైభవంగా జరగనున్న ఈ వేడుక, జీ తెలుగు ఉన్నతికి కృషి చేస్తున్న నటీనటులు, కళాకారులు, దర్శకులు, రచయితలు, నిర్మాతలను సత్కరిస్తుంది. జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2025 పార్ట్-1 లో […]
వినూత్నమైన కథలను ఎంచుకుంటూ, కమర్షియల్ హంగులకు అతీతంగా కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చే నిర్మాతలు ఇండస్ట్రీలో కొద్ది మందే ఉంటారు. అలాంటి వారిలో ఒకరే నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల. తన వానరా సెల్యూలాయిడ్ బ్యానర్‌పై ఇప్పటికే ‘త్రిబాణధారి బార్బరిక్’, ‘బ్యూటీ’ వంటి విభిన్న చిత్రాలను అందించి, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. మంచి సినిమాలు తీయాలనే తపనతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన, ఇప్పుడు మరో మూడు కొత్త ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. […]
సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్హాసన్లను ఒకే తెరపై చూడాలని తమిళ తంబీలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా రాబోతుందంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఆ కలయిక ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. మొదట, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతుందని ప్రచారం జరిగింది. కానీ, రజనీకాంత్ ‘కూలీ’ సినిమా ఫ్లాప్‌తో ఈ క్రేజీ కాంబినేషన్‌కు బ్రేక్ పడిందని వార్తలు వచ్చాయి. దీంతో అభిమానులు నిరాశ చెందారు. Also Read […]
ఒక పాట హిట్టయితే, ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఫామ్‌లోకి వచ్చినట్టేనా? ఈ ప్రశ్న ఇప్పుడు సంగీత ప్రియుల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. దానికి కారణం ఏఆర్ రెహమాన్. కొంతకాలంగా పూర్తిస్థాయి మ్యూజికల్ హిట్ ఆల్బమ్ ఇవ్వడంలో తడబడుతున్న రెహమాన్‌పై, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాతో దర్శకుడు బుచ్చిబాబు సానా పెద్ద నమ్మకమే ఉంచారు. ఆ నమ్మకం ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తోంది. ఏఆర్ రెహమాన్‌కు తెలుగులో ట్రాక్ రికార్డ్ అంత గొప్పగా లేదు. […]
చిత్ర పరిశ్రమలో కొందరి హీరోయిన్లకు సినిమా ఫలితాలతో సంబంధం ఉండదు. ఎన్ని ఫ్లాపులు పలకరించినా వారి ట్యాలెంట్ ముందు ఆఫర్లు క్యూ కడుతుంటాయి. సరిగ్గా ఇదే కోవలోకి వస్తారు జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్. కొంతకాలంగా సరైన హిట్ లేకపోయినా, తాజాగా టాలీవుడ్లో ఓ క్రేజీ ఆఫర్‌ను అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘మహానటి’ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కీర్తి సురేష్, ఆ తర్వాత ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయారు. ముఖ్యంగా, మెగాస్టార్ చిరంజీవితో […]
2026 సంవత్సరం మెగా అభిమానులకు అసలైన పండగ తీసుకురానుంది. ఏడాది ప్రారంభం నుంచి ప్రతీ పండగను ఒక మెగా హీరో తన సినిమాతో కబ్జా చేసేందుకు సిద్ధమయ్యారు. సంక్రాంతితో మొదలయ్యే ఈ సందడి, వేసవి వరకు నిరాటంకంగా కొనసాగనుంది. దీంతో మెగా హీరోల చిత్రాల కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు 2026 ప్రథమార్థం మొత్తం పండగే అని చెప్పొచ్చు. Also Read :Shilpa Shetty : ఫారెన్ వెళ్ళాలా.. 60 కోట్లు కట్టండి! సంక్రాంతి బరిలో మెగాస్టార్ ప్రతీ […]
గత ఏడాది చిన్న చిత్రంగా విడుదలై సంచలన విజయం సాధించిన ‘కమిటీ కుర్రోళ్లు’ సక్సెస్ఫుల్ కాంబినేషన్ మరోసారి పునరావృతం కాబోతోంది. యువతకు కనెక్ట్ అయ్యే కథతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు యదు వంశీ, నిర్మాత నిహారిక కొణిదెలతో కలిసి మరో ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై వీరిద్దరి కలయికలో రాబోయే ఈ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి మొదలైంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా 2026లో సెట్స్ పైకి […]
ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాలకు ₹60 కోట్ల మోసం కేసులో బాంబే హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తీవ్రంగా మందలిస్తూ తిరస్కరించింది. ప్రయాణం చేయాలంటే ముందుగా ఆరోపణలకు సంబంధించిన పూర్తి మొత్తాన్ని, అంటే ₹60 కోట్లను డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా, వారిపై జారీ అయిన లుకౌట్ సర్క్యులర్ (LOC)పై స్టే ఇచ్చేందుకు కూడా […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరొక పక్క రాజకీయాలు కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, నిజానికి ఆయన ఒప్పుకున్న సినిమాలు మాత్రమే పూర్తి చేస్తాడని అనుకున్నారు. అందులో భాగంగా ముందు హరి హర వీరమల్లు, తర్వాత ఓజి, ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాల షూటింగ్స్ ఆయన పూర్తి చేశారు. ఇక సినిమాలకు బ్రేక్ తీసుకుంటారు అని అనుకుంటున్న సమయంలోనే ఆయన దిల్ రాజుకి డేట్స్ ఇచ్చారనే వార్త […]
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుచ్చిబాబు సానా ఈ సినిమాని ఒక రేంజ్లో చెక్కుతున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన 60 శాతం షూటింగ్ పూర్తి కావచ్చింది. ఇప్పటికే దాదాపుగా ఫస్ట్ హాఫ్ పూర్తి అయినట్లుగా సమాచారం. ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని చూసిన సుకుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా సెప్టెంబర్‌కు ఈ ప్రక్రియ అంతా […]