ఈ ఏడాది చివరిలో బాక్సాఫీస్ వద్ద ఒక ఆసక్తికరమైన పోరాటం జరగబోతోంది. ఒకవైపు, ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న గ్లోబల్ విజువల్ మాన్‌స్టర్ ‘అవతార్ 3’ ఉంటే, మరోవైపు టాలీవుడ్ నుంచి అప్ కమింగ్ హీరోల సినిమాలు ‘చాంపియన్’, ‘శంబాల’ అలాగే మాస్ హిట్ కొసం ఎదురు చూస్తున్న కిచ్చా సుదీప్ ‘మార్క్’ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. గ్లోబల్ టెక్నాలజీ రెవల్యూషన్ తీసుకువస్తున్న ‘అవతార్’ వేవ్‌లో ఈ నేటివ్ సినిమాలు నిలబడతాయా? లేక తమదైన ఎమోషన్, థ్రిల్, యాక్షన్‌తో సపరేట్ స్పేస్ క్రియేట్ చేసుకుంటాయా? అసలు బాక్సాఫీస్ ట్రెండ్ ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం. జేమ్స్ కామెరూన్ సృష్టించిన విజువల్ బీస్ట్ ‘అవతార్ 3’ డిసెంబర్ 19న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాపై హాలీవుడ్ హైప్ మామూలుగా లేదు. జేమ్స్ కామెరూన్ రియల్ టైమ్ రియాక్షన్ విజువల్స్ కోసం కొత్త మోషన్ క్యాప్చరింగ్ టెక్నిక్‌ను ఉపయోగించడం టెక్నాలజీకి ఒక మైలురాయి. ఈసారి పాండోరాలో కొత్తగా ‘ఫైర్ ట్రైబ్’ను పరిచయం చేయబోతున్నారు. ఫ్రేమ్-బై-ఫ్రేమ్ హై ఎండ్ VFXతో సినిమా ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇవ్వడం ఖాయం. విజువల్ వండర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ సినిమా, ఇండియన్ సినిమాల కలెక్షన్లపై భారీ ప్రభావం చూపడం ఖాయం.
Also Read :Love Insurance Kompany: ఒకే ఏడాది 300 కోట్ల రికార్డ్ మిస్సయిన ప్రదీప్ రంగనాథన్
‘అవతార్’ తరహా గ్లోబల్ వేవ్ ఉన్నప్పుడు, లోకల్ సినిమాలు తమ కంటెంట్‌ను ఎంత బలంగా ప్రేక్షకులకు అందిస్తాయన్న దానిపైనే వాటి విజయం ఆధారపడి ఉంటుంది. టాలీవుడ్ అప్ కమింగ్ హీరో రోషన్ మేక నటించిన ‘చాంపియన్’ డిసెంబర్ 25న విడుదల కానుంది. ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా. స్పోర్ట్స్ స్పిరిట్‌కు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను జోడించి తీసిన ఈ సినిమా, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులకు కనెక్ట్ అయితే రోషన్ కెరీర్‌కు ప్లస్ అవుతుంది. హీరో ఆది సాయికుమార్ నటించిన ‘శంబాల’ ఒక మిస్టిక్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ కొత్త థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌లను ఆదరిస్తారు. ఒక బలమైన మిస్టిక్ థ్రిల్లర్‌తో ఆది ప్రేక్షకులను ఆకట్టుకుంటే, ఈ సినిమా ఆయన కెరీర్‌కు గేమ్ చేంజర్‌గా మారే అవకాశం ఉంది. మాస్ హిట్ కొసం ఎదురుచూస్తున్న కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన మాస్ యాక్షన్ థ్రిల్లర్ ‘మార్క్’ కూడా డిసెంబర్ 25న విడుదల కానుంది. ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సుదీప్ నటిస్తున్న ఈ సినిమాలో కిడ్నాప్ అయిన పిల్లల్ని కాపాడటం ప్రధాన అంశంగా ఉంది. కిచ్చా సుదీప్ మాస్ యాక్షన్‌కు రీజియనల్ మార్కెట్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. యాక్షన్, థ్రిల్, పవర్-ప్లే డైలాగ్స్‌తో కూడిన ఈ సినిమా ‘అవతార్’ వేవ్‌ని తట్టుకుని నిలబడేందుకు గట్టి ప్రయత్నం చేస్తుంది.
Also Read :Akhanda 2: అఖండ 2లో బోయపాటి ఇద్దరు కొడుకులు
సాధారణంగా, ‘అవతార్’ వంటి విజువల్ వండర్స్ మొదటి వారం రోజులు బాక్సాఫీస్‌ను డామినేట్ చేస్తాయి. అయినప్పటికీ, ఇతర సినిమాల కంటెంట్ బాగుంటే, వాటికి లాంగ్ రన్ దొరికే అవకాశం ఉంటుంది. ‘అవతార్ 3 కలెక్షన్లు మొదటి వారం ఊహించని స్థాయిలో ఉండవచ్చు. మెట్రో నగరాలు, మల్టీప్లెక్స్‌లలో దీని హవా కొనసాగుతుంది. ‘చాంపియన్’ మరియు ‘శంబాల’ సినిమాలు తమ ఎమోషన్/థ్రిల్ అంశాలతో మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకర్షించగలిగితే, ముఖ్యంగా చిన్న సెంటర్లలో మంచి స్పేస్‌ను క్రియేట్ చేసుకుంటాయి. ‘మార్క్’ తన యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌తో కంటెంట్ పరంగా నిరూపించుకుంటే, రీజియనల్ మార్కెట్‌లో బలంగా నిలబడవచ్చు. మొత్తంగా చూస్తే, ఈ ఇయర్ ఎండ్ బాక్సాఫీస్ – గ్లోబల్ టెక్నాలజీ (అవతార్ 3) కి మరియు నేటివ్ కంటెంట్ బలం (చాంపియన్, శంబాల, మార్క్) కి మధ్య ఒక రసవత్తరమైన పోరుగా మారనుంది.