మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మన శంకరవరప్రసాద్’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. సంక్రాంతి రేసులో ఉన్న ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు అనిల్ రావిపూడి అనుసరిస్తున్న వ్యూహం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సినిమాల్లో సస్పెన్స్, థ్రిల్ ఎలిమెంట్స్‌ని చివరి వరకు దాచి పెడతారు, కానీ అనిల్ రావిపూడి మాత్రం కథలోని ప్రధాన అంశాలను అందరికీ తెలిసేలా.. పాటల్లోనే కథ మొత్తం చెప్పేస్తున్నాడు. తాజాగా ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రం నుంచి ‘శశిరేఖ..’ అనే సాంగ్ రిలీజైంది. ఈ పాట, గతంలో విడుదలైన మరో పాట కథా సారాంశాన్ని బయటపెడుతున్నాయి.
Also Read :Nari Nari Naduma Murari: సంక్రాంతి సినిమాల్లో మొదటి డేట్ వచ్చేసింది… ఆరోజే రిలీజ్
ఈ పాటను లవర్స్‌గా ఉన్న ప్రసాద్ (చిరంజీవి), శశిరేఖ (నయనతార) పాడుకునే పాటగా చిత్రీకరించారు. ‘మీసాలపిల్ల..’ పాట: ఇది విడిపోయిన భార్యాభర్తలు లేదా దూరం అయిన ప్రేమికులు పాడుకునే పాటలా ఉంది. చిరంజీవి ప్రసాద్‌గా, నయనతార శశిరేఖగా నటిస్తున్నారు. శశిరేఖ గొప్పింటి అమ్మాయి అని, ఆమె అన్నీ వదిలేసి ప్రసాద్ కోసం వచ్చినట్లుగా కథాంశం పాటల్లో స్పష్టమవుతోంది. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోవడం, మళ్లీ కలవడమే సినిమా కథ అనే విషయం పాటల ద్వారా ముందే ప్రేక్షకులకు తెలిసిపోతోంది.
Also Read :Akhanda 2: షాకింగ్.. అఖండ 2 రిలీజ్ 12న కూడా లేనట్టేనా?
వ్యూహం ఇదేనా?
దర్శకుడు అనిల్ రావిపూడి పాటల్లోనే కథ చెప్పేయడం వెనుక ఒక పెద్ద వ్యూహం ఉండవచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రంలో సస్పెన్స్, థ్రిల్ పెద్దగా ఉండదా? లేదా? అనేది పక్కన పెడితే, కథాంశం ఇది అని ముందే ప్రేక్షకులకు చెప్పడం ద్వారా కథలోని మలుపుల కోసం ప్రేక్షకులు ఎదురు చూడకుండా, ఇది ఒక ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ అని ముందే అంచనా వేసేలా చేస్తున్నాడు. సినిమా చూసేటప్పుడు స్టోరీని పట్టించుకోకుండా, కేవలం చిరంజీవి నటన, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, ఎమోషన్స్, మరియు ఫన్ ట్రీట్‌మెంట్ను మాత్రమే ఎంజాయ్ చేసేలా ఆడియన్స్‌ను ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అంటే, అనిల్ రావిపూడి ఈసారి కథలోని కొత్తదనం కంటే, కథ చెప్పే విధానం (స్క్రీన్‌ప్లే, కామెడీ టైమింగ్)పైనే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి రేసులో ఎంత మేర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.