నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘అఖండ 2: తాండవం’ డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గత వారం విడుదల వాయిదా పడినప్పటికీ, ఆ అనూహ్య పరిణామం సినిమాపై హైప్‌ను మరింత పెంచేసిందనే చెప్పాలి. విదేశాల్లో, ముఖ్యంగా USA లో అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని విధంగా ఉన్నాయి. ‘అఖండ 2’ సినిమాకు సంబంధించి యూఎస్‌ఏలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది గంటల్లోనే టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. మేజర్ సిటీస్‌లో టికెట్ల విక్రయం ఉప్పెనలా ఉంది. తాజా సమాచారం ప్రకారం, కేవలం ఆరు గంటల్లోనే ప్రీ-సేల్స్ ద్వారా $125 వేల డాలర్లు (సుమారు కోటి రూపాయలకు పైగా) వసూలు చేసి, తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత వేగంగా ఈ మార్కును చేరుకున్న సినిమాగా ‘అఖండ 2’ నిలిచింది. ఈ రికార్డ్ బాలయ్య క్రేజ్ ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది.
Also Read:Dimple hayathi : వేడి వేడి అందాలతో చలికి సెగలు తెప్పిస్తున్న డింపుల్ హయతి
ప్రీమియర్ షోల కోసం ప్రవేశపెట్టిన $16 కొత్త ధర వ్యూహం అద్భుతమైన సానుకూల ప్రభావాన్ని చూపింది. అభిమానులు మరియు సినీ ప్రేమికులు ఈ ఆఫర్‌ను అందిపుచ్చుకుని, తమ ఫేవరేట్ హీరో సినిమాను ముందుగానే వీక్షించడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఈ జోరును కొనసాగిస్తూ, యూఎస్‌ఏలో డిసెంబర్ 11 రాత్రే ప్రీమియర్ షోలు ప్రదర్శితం కానున్నాయి. డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ సినిమా ఆర్థిక, న్యాయపరమైన వివాదాల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడింది. అయితే, ఈ గందరగోళం సినిమాకు అదనపు ప్రచారాన్ని తీసుకురావడమే కాక, బాలయ్య అభిమానుల్లో ఆసక్తిని పతాక స్థాయికి చేర్చింది.
నందమూరి బాలకృష్ణ అఖండ రుద్ర సికిందర్ అఘోర, మురళీకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఈ భారీ బడ్జెట్ (₹200 కోట్లు) చిత్రంలో సంయుక్త మీనన్ కథానాయికగా, ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారు. సాశ్వత ఛటర్జీ, పూర్ణ, హర్షాలీ మల్హోత్రా (బజరంగీ భాయిజాన్ ఫేమ్) కీలక పాత్రలు పోషిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించారు. ఈ సినిమా 2D, 3D ఫార్మాట్లలో విడుదలవుతోంది. ఇక #Akhanda2Thandavam హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా, బాలయ్య బాబు రౌద్రం డిసెంబర్ 12న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ‘తాండవం’ సృష్టిస్తుందో చూడాలి.