ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హాస్యభరిత చిత్రం ‘బ్రొమాన్స్’ ఇప్పుడు సోనీ లివ్‌లో మే 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హాస్యం, యాక్షన్, డ్రామా, స్నేహ బంధం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగ సన్నివేశాలతో రూపొందిన ఈ మలయాళ చిత్రం థియేటర్లలో చూడలేనివారికి ఇంట్లోనే అద్భుత అనుభవాన్ని అందిస్తుంది. Vasishta : ఇలాంటి కథ ఎక్కడా వినలేదు.. క్యారెక్టరే హీరో! చిత్ర దర్శకుడు అరుణ్ డి.జోస్ మాట్లాడుతూ, “‘బ్రొమాన్స్’ను థియేటర్లలో ఆదరించిన ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి […]
తమన్నా భాటియా నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘ఓదెల 2’, సూపర్నాచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కు సీక్వెల్. సంపత్ నంది మార్గదర్శనంలో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్‌పై డి. మధు నిర్మించిన ఈ చిత్రంలో తమన్నా సాధువుగా అద్భుత నటన కనబరిచారు. ఏప్రిల్ 17న విడుదలైన ‘ఓదెల 2’ వేసవిలో ప్రధాన ఆకర్షణగా నిలిచి, అన్ని చోట్ల బ్లాక్‌బస్టర్ స్పందనతో విజయవంతంగా రన్ అవుతోంది. ఈ సందర్భంగా శక్తివంతమైన పాత్ర […]
రష్మిక తర్వాత టాలీవుడ్లోకి కన్నడ కస్తూరీల హడావుడి బాగా పెరిగింది. శాండిల్ వుడ్లో కాస్త క్లిక్ అయ్యాక… తెలుగు ఇండస్ట్రీ పై ఫోకస్ చేస్తున్నారు. స్టార్ హీరోలతో పాన్ ఇండియా చిత్రాల్లో జోడీ కట్టి బాలీవుడ్ దృష్టిని ఆకర్షించేందుకు ట్రై చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్‌లో ఇద్దరు భామలు ఇదే పనిలో ఉన్నారు. ఆ ఇద్దరే శ్రీనిధి శెట్టి అండ్ రుక్మిణీ వసంత్. ఏడాది గ్యాప్‌లో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేశారు ఈ ముద్దుగుమ్మలు. కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో […]
బ్లాక్‌బస్టర్ దర్శకుడు త్రినాథరావు నక్కిన తమ తాజా క్రైమ్-కామెడీ డ్రామా ‘చౌర్య పాఠం’తో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంలో యువ ప్రతిభావంతుడు ఇంద్ర రామ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. ‘కార్తికేయ-2’ వంటి చిత్రాలకు చందూ మొండేటి వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన నిఖిల్ గొల్లమారి ఈ సినిమాతో దర్శకుడిగా తొలిసారి పరిచయమవుతున్నారు. నక్కిన నరేటివ్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి వి. చూడమణి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ థ్రిల్లింగ్ […]
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో ఆయన అభిమానులు అత్యంత ఆసక్తికరంగా ఏదో చూసే చిత్రం ఏదైనా ఉందా అంటే అది ఓజి. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అని ప్రస్తావించబడుతున్న ఈ చిత్రాన్ని సాహో డైరెక్టర్ సుజిత్ డైరెక్ట్ చేస్తూ డివివి దానయ్య అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా మీద అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ప్రమోషనల్ కంటెంట్ సినిమా మీద అంచనాలను ఒక్కసారిగా అమాంతం పెంచేసింది. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు […]
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆయన వెన్నునొప్పితో బాధపడుతూ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ మధ్యన కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకుని వచ్చినందున, ప్రస్తుతానికి కుమారుడితో సమయం గడపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ఆయన చేస్తున్న సినిమాలు వాయిదాలు పడుతూ వస్తున్నాయి. ఆయన ఇంకా నటించాల్సిన పోర్షన్స్ పెండింగ్ ఉండడంతో, ఎప్పుడు ఆ సినిమాలు పూర్తి చేస్తారా అని నిర్మాతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా […]
Pravasthi Issue: ఈటీవీ పాడుతా తీయగా కార్యక్రమం మీద సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఆమె జడ్జిలుగా వ్యవహరించిన సింగర్ సునీత, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్‌ల మీద అనుచిత ఆరోపణలు చేయడమే కాక, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ గురించి కూడా సంచలన ఆరోపణలు చేసింది. తన వస్త్రధారణ విషయంలో కూడా అన్యాయం జరిగిందని, తన చేత ఎక్స్పోజింగ్ చేయించే ప్రయత్నం చేశారని ఆరోపించింది. తాజాగా ఈ అంశాల మీద జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ సంస్థ […]
నందమూరి కళ్యాణ్ రామ్ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ […]
అనన్య పాండే కజిన్ హీరోగా ‘సయారా’ అనే సినిమా రూపొందుతోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో మోహిత్ సూరి తెరకెక్కిస్తున్న ‘సయారా’ చిత్రం జూలై 18, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. అహాన్ పాండేకి జంటగా అనీత్ పద్దా నటించిన ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ను ఇచ్చారు. ఈ సినిమాను జూలై 18, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు. ఆదిత్య చోప్రా సమర్పణలో అక్షయ్ విద్హానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘సయారా’ చిత్రాన్ని ఓ ఇంటెన్స్ […]
కాదేదీ ఫ్యాన్ వార్స్‌కు అతీతం అనేట్టుగా మారిపోయింది ఇప్పుడు పరిస్థితి. నిజానికి ఈ ఒకప్పుడు ఫ్యాన్ వార్స్ కేవలం సినిమాలు రిలీజ్ అయినప్పుడు లేదా ఒక హీరో రికార్డు మరో హీరో బద్దలు కొట్టినప్పుడు మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. తాజాగా మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆయన ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి చేసిన యాడ్ రెమ్యూనరేషన్ వ్యవహారంలో ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. […]