తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025 వేడుకలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ సినీ పరిశ్రమకు సంబంధించిన మొదటి తరం అన్న నందమూరి తారక రామారావు గారు, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు, రెండవ తరం కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణంరాజు గారు, మూడవ తరం చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గైరెలాంటి హీరోలు వచ్చారు. ఈ రోజు నాల్గవ తరం సినీ పరిశ్రమ ఇక్కడ ఉంది. నాల్గవ తరంలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, లేదా అల్లు అర్జున్ కావచ్చు. మీ అందరూ తెలుగు సినీ పరిశ్రమకు నాల్గవ తరం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ రోజు ఈ వేదిక మీద నుంచి చాలా మంది నాకు విద్యార్థి దశ నుంచి పరిచయం ఉన్నవాళ్లు.
Also Read : AA 22 Atlee 6 : బన్నీతో చేసే మూవీ దేశం గర్వించేలా ఉంటుంది.. అట్లీ కామెంట్స్ వైరల్
ఈ రోజు సినీ పరిశ్రమలో రాణిస్తూ నన్ను ఇక్కడ కలుస్తుంటే నాకు చాలా ఆనందం కలిగింది. బన్నీ కావచ్చు, వెంకట్ కావచ్చు, అశ్వినీదత్ గారి అమ్మాయిలు, వాళ్ల అల్లుడు, వీళ్లందరూ యంగ్ ఏజ్‌లో, కాలేజ్ డేస్ నుంచి నాకు తెలుసు.
ఈ రోజు గొప్ప డైరెక్టర్లుగా, నటులుగా, నిర్మాతలుగా, టెక్నీషియన్లుగా మా యువ మిత్రులు అందరూ ఈ సినీ పరిశ్రమలో రాణించడం, ఈ రోజు వారందరినీ వేదికపై అభినందించడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది కానీ మిమ్మల్ని అభిమానంగా చూసుకుంటుంది. మీ అభివృద్ధికి నూటికి నూరు శాతం తోడ్పాటు అందిస్తుంది. ప్రభుత్వం నడిపేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. అది మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మిమ్మల్ని అభినందించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.
Also Read : Revanth Reddy : రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరినీ అభినందిస్తున్నా
ఈ రోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రైజింగ్ 2047 గురించి చెబుతున్నా. ఫిలిం ఇండస్ట్రీ కూడా దేశంలో ఒక ప్రముఖ ఇండస్ట్రీగా, దేశ అభివృద్ధికి పాటుపడాలని మా ప్రణాళిక. అందుకే ఈ రోజు ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ ఒక మాట స్పష్టంగా చెప్పదలచుకున్నాను. 2047 నాటికి ట్రిలియన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా నిలబడాలనేది ప్రణాళిక. నేను మిత్రుడు రాజమౌళిని అడుగుతున్నాను, బాలీవుడ్ అంటే ముంబై, హాలీవుడ్ అంటే అమెరికా అనే రోజులు పోవాలి. మీరు వాటిని ఇక్కడికి తీసుకురండి. మీకు కావాల్సింది నేను సిద్ధం చేస్తాను. ప్రణాళికలు వేయండి, మీకేం కావాలో నాకు చెప్పండి. ఇక్కడి నుంచి మరో 22 సంవత్సరాలు క్రియాశీలక రాజకీయాల్లో నేనుంటాను. ఏ హోదాలో ఉన్నా మీకు అండగా ఉంటాను.