పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఇటీవల పూర్తయింది. అంతా సిద్ధంగా ఉన్న ఈ సినిమా రిలీజ్ కావాల్సిన సమయంలో వాయిదా పడింది. ఈ సినిమాకు సంబంధించి కొత్త రిలీజ్ డేట్ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. సినిమా ఎప్పుడు వస్తుందనే విషయంలో ఎవరికీ స్పష్టత లేదు.
Also Read:Nagababu: పవన్ కళ్యాణ్ వ్యక్తి కాదు అణుశక్తి
ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి రకరకాల రిలీజ్ డేట్‌ల గురించి చర్చ జరుగుతోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు, ఈ సినిమాకు జూలై 24వ తేదీని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి, ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసింది. ఆ సంస్థ సినిమా రిలీజ్ విషయంలో ఒత్తిడి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ డేట్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
Also Read:Hanuman Junction: ‘హనుమాన్ జంక్షన్’ మళ్లీ వస్తోంది!
నిజానికి, ‘వార్ 2’ సహా ‘కూలీ’ సినిమా ఆగస్టు 14వ తేదీన రికార్డు స్థాయిలో స్క్రీన్‌లను పంచుకోబోతున్నాయి. అంతకుముందు లేదా ఆ తర్వాత పెద్ద సినిమాల రిలీజ్‌లు లేకపోవడంతో, జూలై 24న రిలీజ్ అయితే ‘హరిహర వీరమల్లు’కు మంచి థియేటర్ కౌంట్ లభిస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అన్నీ కుదిరిన తర్వాత అధికారికంగా రిలీజ్ డేట్‌ను ప్రకటించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.