తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025 వేడుకలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. దాదాపుగా 14 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డు కార్యక్రమాన్ని నిర్వహించాలని సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు, ముఖ్యంగా దిల్ రాజు, ఈ ప్రతిపాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది అన్నారు. దీనికి సంబంధించి ఈ నాడు ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమానికి నన్ను, నాతోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా మంత్రి వాకిటి శ్రీహరి, మిత్రుడు మధు యాష్కి, ఇతర రాజకీయ ప్రముఖులు, సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు, అందరినీ ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి ఆహ్వానించి, గతంలో ప్రారంభించిన ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగించడానికి మీరందరూ సహకరించినందుకు మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను.
Also Read : UPSC Recruitment 2025: యూపీఎస్సీలో 462 జాబ్స్.. ఈ జాబ్స్ కొడితే మీ లైఫ్ సెట్.. మీరూ ట్రై చేయండి
మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమను ఎప్పుడూ గౌరవించి, మీకు అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయడమే కాకుండా, మిమ్మల్ని అభినందించాలనే ఆలోచనతో, 60 సంవత్సరాల క్రితం, నాకు తెలిసినంతవరకు, సినీ ప్రేమికులకు ఇంకా బాగా తెలిసి ఉండాలి, 1964లో తెలుగు సినీ పరిశ్రమను గుర్తించడానికి డైరెక్టర్లను, నటులను, అదేవిధంగా ఇతర కళాకారులను గుర్తించాలని, అవార్డులు ఇవ్వాలని, ఆ అవార్డులకు నంది పేరుతో ఉంచాలని మొదలుపెట్టి, 14 సంవత్సరాల ముందు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే, ఇస్తూ వచ్చారు. నంది అవార్డులలో మొట్టమొదటి బెస్ట్ యాక్టర్ అవార్డు అక్కినేని నాగేశ్వరరావుకు ఇచ్చారు. అదేవిధంగా, వివిధ కారణాల చేత 14 సంవత్సరాల క్రితం ఆగిపోయిన ఈ కార్యక్రమాన్ని మళ్లీ కొనసాగించాలనే ఆలోచనతో, మా ప్రభుత్వం నంది అవార్డులను ఈ రోజు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్‌గా మీ ముందుకు తీసుకొచ్చి నిలబడింది.
Also Read : UPSC Recruitment 2025: యూపీఎస్సీలో 462 జాబ్స్.. ఈ జాబ్స్ కొడితే మీ లైఫ్ సెట్.. మీరూ ట్రై చేయండి
ఈ పది సంవత్సరాలు, 11 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తీసిన అన్ని సినిమాలకు సంబంధించిన డైరెక్టర్లను, కళాకారులను, కవులను, నాయకులను, సాంకేతిక నిపుణులను, అందరినీ అభినందించాలని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఇన్ని గంటలు అయినా ప్రముఖులందరూ ఇక్కడే ఉండి, పరిశ్రమ అంతా ఒక్కటేనని, ఈ పరిశ్రమకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని మేమందరం కూడా ఆహ్వానిస్తున్నామని, ఇంత సమయం ఇక్కడ కేటాయించినందుకు మీ అందరినీ అభినందిస్తూ, గతంలో భారత సినీ పరిశ్రమ అంటే బాలీవుడ్ అనుకునేవాళ్లు, తెలుగు సినీ పరిశ్రమ అంటే చెన్నైలో ఉందని అనుకునేవారు, కానీ ఈ నాడు భారతీయ సినీ పరిశ్రమ అంటే తెలుగు సినీ పరిశ్రమ, తెలుగు సినీ పరిశ్రమకు హైదరాబాద్ వేదిక అని ఈ రోజు మీ అందరూ నిరూపించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరినీ అభినందిస్తున్నాను.