“లోపలికి రా చెప్తా” అంటున్నారు మేకర్స్. మాస్ బంక్ మూవీస్ పతాకంపై కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ గణేష్, వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న హర్రర్ బేస్డ్ కామెడీ ఎంటర్ టైనర్ సినిమానే ఈ ‘లోపలికి రా చెప్తా’. కొండా వెంకట రాజేంద్ర హీరోగా నటించడమే కాకుండా ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను కూడా చూసుకున్నారు. తాజాగా సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ‘లోపలికి రా చెప్తా’ చిత్రం జూలై 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లుగా తెలిపారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకట రాజేంద్ర మాట్లాడుతూ.. ‘‘మా చిత్రంలో హీరో డెలివరీ బాయ్. అందుకే చిత్రంలోని మొదటి సాంగ్‌ను ఓ డెలివరీ బాయ్‌తో విడుదల చేయించాం. ఆ పాటకు చాలా మంచి స్పందన వచ్చింది. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాం. సెన్సార్ కార్యక్రమాలను పూర్తయ్యాయి. జూలై 5 న గ్రాండ్‌గా థియేటర్లలోకి సినిమాను తీసుకు రానున్నాం. ప్రతిష్టాత్మకమైన సరిగమ ఆడియో కంపెనీ ఈ చిత్ర ఆడియో హక్కులు దక్కించుకుంది. అవుట్ ఫుట్ చూసి టీమంతా ఎంతో హ్యాపీగా ఉన్నాం. కచ్చితంగా ప్రేక్షకులను మెప్పించే సినిమాగా ‘లోపలికి రా చెప్తా’ నిలుస్తుంది. సహకరించిన అందరికీ ధన్యవాదాలు. త్వరలోనే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కలుసుకుందాం’’ అని అన్నారు.