జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యనే డ్రాగన్ అనే సినిమా షూటింగ్లో పాల్గొన్నాడు. ఇంకా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేయలేదు, కానీ డ్రాగన్ అనే ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలో జరుగుతుండగా, ఆ షెడ్యూల్లో పాల్గొని హైదరాబాద్ తిరిగి వచ్చాడు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మొదట్లో పూర్తవుతుంది. జూన్ 2026లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. Read More: Arya@21: అల్లు అర్జున్’ను నిలబెట్టిన సినిమాకి […]
అల్లు అర్జున్ హీరోగా, అనూ మెహతా హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ఆర్య. ఈ మూవీ ద్వారా సుకుమార్ దర్శకుడిగా పరిచయమయ్యారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా 2004 మే 7న విడుదలైంది. ఈ చిత్రం విడుదలై నేటికి 21 ఏళ్లు అయ్యాయి. అల్లు అర్జున్ లైఫ్ ఛేంజింగ్ మూవీగా నిలిచిన ఆర్య విశేషాలు ఇవీ: అలా మొదలై 2004 మే 7, మే ఎండల గురించి చెప్పేదేముంది? అప్పటికే స్కూళ్లూ, కాలేజీలకు […]
పెళ్లిచూపులు అనే సినిమాతో మంచి విజయం సాధించిన తరుణ్ భాస్కర్, ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది లాంటి మరో ఆకట్టుకునే సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాడు. ఈ మధ్యలో కీడా కోలా అనే సినిమా చేశాడు, కానీ అంతకుముందే నటుడిగా మారిపోవడంతో బిజీగా గడిపేస్తున్నాడు. నిజానికి ఆయన జై జైహే అనే సినిమా రీమేక్‌లో హీరోగా నటిస్తున్నాడు. మరోపక్క, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ కోసం ప్రేక్షకుల నుంచి డిమాండ్ బాగా రావడంతో, ఆయన ఆ […]
ఒక రకంగా సంక్రాంతి తర్వాత తెలుగు సినిమా పరిశ్రమకు సమ్మర్ హాలిడేస్ కూడా అంతే ముఖ్యం. అయితే, ఈ సమ్మర్లో పెద్ద సినిమాలు రిలీజ్ కావడం లేదు. నాని హీరోగా నటించిన హిట్ 3 ఈ సమ్మర్లో ఇప్పటికే మంచి కలెక్షన్స్ రాబట్టి, చాలా ప్రాంతాల్లో లాభాల జోన్లోకి వెళ్లగా, సినిమా టీమ్ దాదాపు అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అయినట్లు ప్రకటించింది. Read More: YCP: వైసీపీలో చేరిన మాజీ నేతలు.. కండువా కప్పి ఆహ్వానించిన […]
ఇంద్రజ మరియు అజయ్ జంటగా నటించిన చిత్రం CM పెళ్లాం. బొల్లా రామకృష్ణ రెడ్డి (బీఆర్కే) నిర్మాణంలో, గడ్డం రమణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మే 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. దర్శకుడు గడ్డం రమణారెడ్డి మాట్లాడుతూ… “ఒక ఎమ్మెల్యే సీఎం అవుతాడు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థితో పాటు ఆయన భార్య కూడా ఓట్లు అడుగుతుంది. కానీ, గెలిచిన తర్వాత ఎంతమంది […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ రోజు పండగ రోజు. ఎందుకంటే, ఆయన నటిస్తున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా సినిమా “హరిహర వీరమల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్” షూటింగ్ ఎట్టకేలకు పూర్తయింది. ఈ సినిమా ప్రయాణం 2019లో మొదలై, ఎన్నో అడ్డంకులు, ఆలస్యాలు దాటుకుని, 2025 మే నాటికి ఒక ముగింపుకు వచ్చింది. ఈ ఐదేళ్ల ప్రయాణం గురించి, సినిమా విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రారంభం: 2019 సెప్టెంబర్ […]
ప్రముఖ నటి, నిర్మాత సమంత తన ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న తొలి చిత్రం శుభం. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో, వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతంతో రూపొందిన ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా సమంత మీడియాతో చిత్ర విశేషాలు పంచుకున్నారు. ప్ర: నిర్మాతగా మొదటి చిత్రం శుభం గురించి ఎలా ఫీల్ అవుతున్నారు? నటిగా శుక్రవారాల అనుభవం ఉంది, కానీ నిర్మాతగా […]
తెలుగు సినిమా ప్రేమికులకు శుభవార్త! భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ZEE5, ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం, మిసెస్, మ్యాక్స్, మజాకా వంటి సూపర్‌హిట్ సినిమాలతో అలరించింది. ఇప్పుడు, తాజా తెలుగు యాక్షన్-థ్రిల్లర్ రాబిన్‌హుడ్ మే 10 సాయంత్రం 6 గంటలకు ZEE5 మరియు జీ తెలుగులో ఒకేసారి విడుదల కానుంది. వెంకీ కుదుముల దర్శకత్వంలో వచ్చిన రాబిన్‌హుడ్‌లో నితిన్ రామ్‌గా, శ్రీలీల నీరాగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా “హరిహర వీరమల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్” సినిమా షూటింగ్ ఎట్టకేలకు పూర్తయింది. చివరి రెండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ షూటింగ్లో పాల్గొన్న తర్వాత, సినిమా టీం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ వార్త పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించే అంశంగా నిలిచింది. “హరిహర వీరమల్లు” సినిమా 2020లో ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. […]
‘కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’ శ్రీ విష్ణు నటించిన #సింగిల్, గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ సమర్పణలో విడుదల కానుంది. కళ్యాణ ఫిల్మ్స్‌తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ హోల్సమ్ ఎంటర్టైనర్లో కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా, వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటించారు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 9న థియేటర్లలో సందడి చేయనుంది. టీజర్, ట్రైలర్, పాటలు ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు […]