సందీప్ రాజ్ షో రన్నర్‌గా హర్ష రోషన్, భాను, జయతీర్థ ప్రధాన పాత్రల్లో జోసెఫ్ క్లింటన్ దర్శకత్వం వహించిన వెబ్ సిరిస్ AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్. జూలై 3 నుంచి సిరీస్ ఈటీవి విన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. హీరోలు శివాజీ, సుహాస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శివాజీ మాట్లాడుతూ…అందరికీ నమస్కారం. చదువు అనేది చాలా అవసరం. ఆల్ ఇండియా ర్యాంకర్స్.. ఈ టైటిల్ వినగానే ఈటీవీలో #90కి మించి మరో పెద్ద బ్లాక్ బస్టర్ సిరీస్ రాబోతుందని నాకు అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దీనికి కనెక్ట్ అవుతారు.
Also Read:Bihar: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు..
చదువు అనేది నేచురల్ గా చదవాలి. కేవలం ర్యాంక్స్ కోసం చదవడం అనేది ఒక రకమైన హింస. ఈ సిరీస్ అలాంటి తల్లిదండ్రులకి ఒక గుణపాఠం కావాలి. ఈటీవీ సమాజం పట్ల చాలా బాధ్యతగా ఉంటుంది. రామోజీరావు గారు తెలుగు జాతిలో పుట్టిన ఆణిముత్యం. వారి సంస్థ నుంచి వచ్చిన కథల్లో చాలా గొప్ప సందేశం ఉంటుంది. ఈ మధ్య కొత్తగా టింగ్లీష్ అంటున్నారు. అలా అంటే ఎక్కడో మండుతుంది. తెలుగులో మాట్లాడితే తెలుగు నటుడుకి ఆ కిక్కే వేరు. అందుకే అందరూ కూడా తెలుగులో స్క్రిప్ట్ రాసుకోవాలని కోరుకుంటున్నాను. తెలుగులో ఉండే మాధుర్యం వేరు. సినిమా అనేది ఎమోషన్. అది మాతృభాషలో రాసినప్పుడు ఇంకా అద్భుతంగా పండుతుంది. ఈటీవీ విన్ కొత్తరకంగా కథల్ని చెప్పాలని ప్రయత్నం చేస్తుంది. ఇది కూడా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. అందరికీ థాంక్యు’అన్నారు,