Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Thammudu Movie Highlights Sriram Venu Interview About Thammudu Movie

Sriram Venu: ఆర్టికల్ స్ఫూరితో “తమ్ముడు” కథ.. ట్రెండ్ ఫాలో అవుతున్నాం!

Published Date :June 30, 2025 , 2:50 pm
By Bhargav Chaganti
  • తమ్ముడు" సినిమా జూలై 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
  • నితిన్, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు!
  • బడ్జెట్ లో కాంప్రమైజ్ లేకుండా తెరకెక్కిన "తమ్ముడు"!
Sriram Venu: ఆర్టికల్ స్ఫూరితో “తమ్ముడు” కథ.. ట్రెండ్ ఫాలో అవుతున్నాం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

“సంక్రాంతికి వస్తున్నాం” బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ “తమ్ముడు”. నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. “తమ్ముడు” సినిమా జూలై 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ ను ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు డైరెక్టర్ శ్రీరామ్ వేణు.

– “తమ్ముడు” సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ట్రైలర్ లో కథ ఎలా ఉండబోతుందో చెప్పాం. సెన్సార్ వాళ్లు కొన్ని కట్స్ చెప్పారు. మేము ఆ కట్స్ వద్దు అనుకున్నాం. ఒప్పుకుంటే యు బై ఎ సర్టిఫికెట్ ఇచ్చేవాళ్లు. సినిమాలోని ఎస్సెన్స్ ను సరిగ్గా ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లాలనే కట్స్ లేకుండా ఎ సర్టిఫికెట్ తీసుకున్నాం. ఇది మా అందరి ఉమ్మడి నిర్ణయం. దిల్ రాజు గారు ఒక్కరే ఈ డెసిషన్ తీసుకోలేదు. సినిమాలో అంతగా హింస లేదు. కొత్తగా వచ్చిన సెన్సార్ ఆఫీసర్స్ స్ట్రిక్ట్ గా ఉన్నారు. వాళ్లనూ తప్పు పట్టలేం. వారి గైడ్ లైన్స్ ప్రకారం వర్క్ చేస్తుంటారు.

Also Read

  • Niharika Konidela: వరుణ్ - లావణ్యల 'సీక్రెట్' లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!
  • Tollywood Pan World Movies: అందరికీ 'పాన్‌ వరల్డ్‌ మూవీ'నే కావాలా?
  • Vijay Varma Dating: జవాన్ నటితో మిల్కీ బ్యూటీ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్! విజయ్ వర్మ ప్రేమలో ఉన్నాడా?
  • Puri Jagannadh: పూరీ 'స్లమ్ డాగ్' విడుదలకు అడ్డంకులు?

– ఈ కథలో హీరోతో పాటు ఐదుగురు లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వసిక విజయన్, దిత్య ముఖ్యమైన పాత్రలు చేశారు. హీరో అంటే ఇంత లెంగ్త్ ఉండాలి అనేది “తమ్ముడు”లో ఉండదు. హీరోతో పాటు ఐదుగురు వుమెన్ క్యారెక్టర్స్ బలంగా ఉంటాయి. విక్రమ్ లో కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కథలో ఎలా ట్రావెల్ అవుతుందో అలా మా మూవీలోనూ ఉంటుంది. కథ ప్రకారమే తమ్ముడు టైటిల్ పెట్టాం.

– “తమ్ముడు” కథ విని దిల్ రాజు గారు బడ్జెట్ గురించి ఆలోచించకుండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. అంతకుముందు మా కాంబోలో ఐకాన్ మూవీ కోసం వర్క్స్ చేసుకున్నాం. ఆ తర్వాత ఈ మూవీ స్టార్ట్ చేశాం. ఈ కథకు సెట్ అయ్యే హీరో కోసం సెర్చ్ జరిగింది. నితిన్ బాగుంటాడని తీసుకున్నాం. ఓ దినపత్రికలో వచ్చిన ఆర్టికల్ స్ఫూరితో “తమ్ముడు” కథను సిద్ధం చేసుకున్నా.

– లయ గారి పాత్ర కోసం ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఒకరికి కథ చెప్పాను. ఆమెకు స్టోరీ, క్యారెక్టర్ నచ్చింది కానీ తన పర్సనల్ రీజన్స్ వల్ల నటించలేదు. అయితే మరోసారి ఇలాంటి క్యారెక్టర్ వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పింది. ఆ తర్వాత లయ గారు ప్రాజెక్ట్ లోకి వచ్చారు. ఆమెది ఈ మూవీలో 90 డేస్ క్యారెక్టర్. తను బాగా సపోర్ట్ చేసి మూవీ ఫినిష్ చేసింది.

– మన సినిమాల్లో ఫైట్స్ త్వరగా వచ్చి వెళ్తుంటాయి. మా సినిమాలో ఫైట్స్ ను ఎపిసోడ్స్ ఫీల్ ఉండేలా రూపొందించాం. ఈ ఫైట్ సీక్వెన్సులు మంచి ఇంపాక్ట్ ఉంటాయి. కథను కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాలనే ప్రయత్నిస్తుంటాను. ఒక్కో దర్శకుడికి ఒక్కో మార్క్ ఉంటుంది. నా స్క్రిప్ట్స్ లో ఫీమేల్ క్యారెక్టర్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పటిదాకా అలా చేస్తూ వచ్చాను. నెక్ట్స్ సినిమాకు ఎలా ఉంటుందో చెప్పలేను.

– బడ్జెట్, క్రియేటివ్ పరంగా దిల్ రాజు గారు “తమ్ముడు” మూవీ బాధ్యత మొత్తం నాకే అప్పగించారు. సినిమా మొత్తం కంప్లీట్ అయ్యాక ఆయనకు చూపించాం. ఆయన ఎక్సిపీరియన్స్ ప్రకారం కొన్ని సజెషన్స్ ఇచ్చారు. వాటిని ఇన్ క్లూడ్ చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. 8 నెలల్లో ఈ సినిమాను కంప్లీట్ చేయాలనుకున్నాం కానీ రెండేళ్లు పట్టింది. అయినా మేము ముందు అనుకున్న బడ్జెట్ లోనే మూవీ ఫినిష్ చేశాం.

– “తమ్ముడు” ప్రమోషన్స్ లో అందరూ పాల్గొంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ బిజీ వల్ల నేను ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేకపోతున్నా. ప్రమోషన్స్ కు డైరెక్టర్స్ లీడ్ తీసుకోవడం అనేది ఇప్పుడు ట్రెండ్ గా మారింది. మేమూ అదే ఫాలో అవుతున్నాం. ఒక గర్వం నిలబడటానికి జరిగిన యుద్ధమే తమ్ముడు మూవీ. బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా కథలో ఉన్నా అనేక లేయర్స్ తో మూవీ సాగుతుంది. మా పాప దిత్య ఈ చిత్రంలో ఒక కీ రోల్ చేసింది. ఈ సినిమా కోసం మూడు ఆడిషన్స్ లో పాల్గొంది. తను ఈ సినిమా కోసం 70 రోజులు షూటింగ్ చేసింది.

– మిగతా స్పోర్ట్స్ కంటే ఆర్చరీకి మెంటల్ గా, ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా, ఏకాగ్రతతో ఉండాలి. గాలి వచ్చే దిశను, వేగాన్ని కూడా అంచనా వేయగలగాలి. విలువిద్య చాలా పురాతనమైనది, రాముడు, అర్జునుడి కాలం నుంచీ చూస్తున్నాం. ఆర్చరీని కథలో ఇన్ క్లూడ్ చేయాలని చాలా రోజులుగా అనుకున్నాం. “తమ్ముడు”లో కుదిరింది. ఆర్చరీ ట్రైనర్ తో నితిన్ కు 15 డేస్ ట్రైనింగ్ ఇప్పించాం. ఫారెస్ట్ లో షూటింగ్ చేసినప్పుడు అందరికీ గాయాలు అయ్యాయి. రోడ్లు సరిగ్గా లేక, వెహికిల్స్ అక్కడి దాకా వెళ్లలేక ఇబ్బందులు పడ్డాం. ఈ మూవీకి సేదు, సమీర్ రెడ్డి, గుహన్ కెమెరామెన్స్ గా పనిచేశారు. ఏ కెమెరామెన్ వచ్చినా నా దగ్గరున్న విజువల్ టెంప్లేట్ తో “తమ్ముడు” మూవీ విజువల్ గా బ్యూటిఫుల్ గా తెరకెక్కించాం.

– కాంతార చూశాక సప్తమిగౌడ మా మూవీలోని క్యారెక్టర్ కు బాగుంటుందని అనిపించి తీసుకున్నాం. తను బాగా పర్ ఫార్మ్ చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ చాలా టాలెంటెడ్. మా మూవీకి మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. థియేటర్ లో ఆయన వర్క్ చూస్తారు. నిడివి పరంగా చూస్తే నేను ఎక్కువ లెంగ్త్ షూటింగ్ చేయను. ఈ సినిమాలో ల్యాగ్ ఉండదు. రాజు గారు సినిమా చూశాక ఎక్కడా కట్స్ చెప్పలేదు.

– నా ప్రతి సినిమా ఒక కొత్త జానర్ లో ఉంటుంది. నేనెప్పుడూ జానర్ రిపీట్ చేయలేదు. నా నెక్ట్స్ మూవీ ఐకాన్ ఉంటుందా, లేక మరో మూవీ ఉంటుందా అని తర్వాత చెప్తా. మలయాళం నుంచి ఒక యాక్టర్ ను తీసుకోవాలని అనుకున్నప్పుడు స్వసిక బాగుంటుందని అనిపించింది. మిగతా పాత్రలకు కూడా తెలుగు యాక్ట్రెస్ ను అనుకున్నాం కానీ కొన్ని రీజన్స్ తో కుదరలేదు.

– రాజు గారి ప్రొడక్షన్ లో నాకు కావాల్సినంత స్వేచ్ఛ, కంఫర్ట్ ఉంటుంది. ఇలాంటి కంఫర్ట్ తో మరో మంచి అవకాశం వస్తే ఇంకో బ్యానర్ లోనూ మూవీ చేస్తా. రాజు గారు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీసి ఉంచలేదు. పాన్ ఇండియా సినిమా చేయకూడదని కాదు. అలాంటి ప్రాజెక్ట్ కుదిరితే తప్పకుండా చేస్తా. పాన్ ఇండియా అని రిలీజ్ చేసిన అన్ని సినిమాలు ఆదరణ పొందలేదు కదా.

– దిల్ రాజు గారి ప్రతి సినిమాను అమోజాన్ వాళ్లు తీసుకునేవారు. ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ వాళ్లు చూసి మంచి రేట్ కు తీసుకున్నారు. నితిన్ కు ఇప్పుడున్న సక్సెస్ ట్రాక్ బట్టి చూస్తే ఓటీటీ, శాటిలైట్ బిజినెస్ పరంగా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. థియేట్రికల్ రిలీజ్ ను కంఫర్ట్ గా చేసుకుంటున్నాం.

– ఐకాన్ మూవీ సెట్స్ మీదకు వెళ్లని టైమ్ లో నేను బాధపడలేదు. ఎందుకంటే నా కెరీర్ లో మొదటి చిత్రానికి రెండో సినిమాకు మధ్యలో ఏడేళ్ల గ్యాప్ వచ్చింది. అప్పటికి పెళ్లై పిల్లలు ఉన్నారు. అలాంటి టైమ్ లోనే సర్వైవ్ అయ్యాను. కాబట్టి లైఫ్ లో దేనికీ డిప్రెషన్ లోకి వెళ్లలేదు. రాజు గారి బ్యానర్ లోనే వేరే సినిమాలకు వర్క్ చేస్తూ వచ్చాను.

– ఏఐ సహా చాలా టెక్నాలజీలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. టెక్నికల్ గా యాప్స్ ఎంత వర్క్ చేసినా మన హ్యూమన్ ఎఫర్ట్స్ సినిమాలకు తప్పకుండా కావాల్సిందే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Dil Raju
  • Family Drama
  • July 4 release
  • Laya
  • nitin

తాజావార్తలు

  • Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్

  • Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?

  • Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..

  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?

  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions