వెంకీ అట్లూరి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తొలుత నటుడిగా కొన్ని సినిమాలు చేసిన ఆయన, తర్వాత దర్శకుడిగా మారి తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ‘తొలిప్రేమ’ అంటూ వరుణ్ తేజ్‌తో హిట్ కొట్టిన ఆయన, తర్వాత అఖిల్‌తో ‘మిస్టర్ మజ్ను’ అనే సినిమా చేసి పరాజయం పొందారు. ‘రంగ్ దే’ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది కూడా వర్కౌట్ కాలేదు. అయినప్పటికీ, తర్వాత చేసిన ‘సార్’ మరియు ‘లక్కీ భాస్కర్’ సినిమాలు హిట్‌లుగా నిలిచాయి. అయితే, తాను చేసిన ఈ ఐదు సినిమాల స్క్రిప్ట్‌లను ముందుగా అక్కినేని నాగచైతన్య వద్దకే తీసుకెళ్లానని, కథలు చెప్పానని, కథలు నచ్చినప్పటికీ పలు కారణాల వల్ల ప్రాజెక్ట్‌లు ఫైనల్ కాలేదని ఆయన చెప్పుకొచ్చారు.
Also Read:HHVM : వీరమల్లు ట్రైలర్ అద్భుతంగా ఉంది.. నాగవంశీ పోస్ట్ వైరల్..
తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్ షోలో పాల్గొన్న ఆయన, తన సినీ జర్నీకి సంబంధించి పలు కీలక విషయాలను పంచుకున్నారు. నిజానికి వెంకీ అట్లూరి అక్కినేని అభిమాని అని సినీ సర్కిల్స్‌లో చెప్పుకుంటారు. అలాంటి ఆయన అక్కినేని హీరోతో సినిమా చేసి ఉంటే, అది కచ్చితంగా హిట్ అయి ఉండేదని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు. ‘మిస్టర్ మజ్ను’ సినిమా బాగానే ఉన్నప్పటికీ, ఎందుకో వర్కౌట్ కాలేదని అక్కినేని అభిమానులు భావిస్తుంటారు. ఇప్పుడు తాను చేయాలనుకున్న అన్ని సినిమాల కథలను ముందుగా నాగచైతన్యకే చెప్పానని ఆయన చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.