తెలుగులో పాకీజాగా గుర్తింపు పొంది, కొన్ని సినిమాల్లో నటించిన నటి గత కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న విషయం తెలిసిందే. గతంలో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌కు సంబంధించిన ఇంటర్వ్యూలలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే, తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశిస్తూ ఆమె ఒక వీడియో రికార్డు చేసింది. తన పేరు పాకీజా అని, తాను గతంలో కొన్ని కామెడీ రోల్స్ చేశానని ఆమె చెప్పుకొచ్చింది.
Also Read:Allu Arjun : బ్లాక్ బస్టర్ డైరెక్టర్లను వదులుకున్న బన్నీ..!
తన ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఏమాత్రం బాగాలేదని, ఆర్థిక పరిస్థితి సరిగా లేని నేపథ్యంలో తాను తన సొంత గ్రామమైన తమిళనాడులోని కారైకుడిలో నివసిస్తున్నానని తెలిపింది. తనకు తమిళనాడులో ఆధార్ కార్డు ఉందని, దాన్ని ఆధారంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్‌లో ఏదైనా పెన్షన్ ఇప్పించే ప్రయత్నం చేయాలని ఆమె కోరింది. అలాగే, తనను వారిద్దరూ ఆదుకోవాలని, కాళ్లు పట్టుకుంటానని ఆమె మొరపెట్టుకుంది. అంతేకాక, తనకు డబ్బు సహాయం అక్కర్లేదని, తన ఆధార్ కార్డును ఆధారంగా చేసుకొని ఏదైనా సహాయం చేయాలని ఆమె చేతులు జోడించి వేడుకుంది. ఈ మేరకు ఆమె ఒక వీడియో రికార్డు చేసి మీడియా ప్రతినిధులకు షేర్ చేయడం గమనార్హం.