అందాల అరకు లోయ చాలా కాలం తరువాత పర్యాటకులతో కళకళలాడుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆంక్షలను సడలిస్తూ వస్తున్నారు. ఆంక్షలు క్రమంగా సడలిస్తుండటంతో అన్ని రంగాలు క్రమంగా తెరుచుకుంటున్నాయి. మూడు నెలల క్రితం మూతపడిన పర్యాటక రంగం తిరిగి తెరుచుకున్నది. రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకు వ్యాలీకి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు.
Read: తెలంగాణ ప్రజలకు మెగాస్టార్ విషెష్
వారాంతపు సెలవులు కావడంతో అరకు వెళ్లి అక్కడ సేదతీరేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. పర్యాటకుల రాకతో అరకులోని అతిథి గృహాలన్ని నిండిపోయాయి. మూడు నెలల తరువాత అరకులో సందడి వాతావరణం నెలకొందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే పర్యాటకులను అనుమతిస్తున్నామని అతిధి గృహాల యాజమాన్యం చెబుతున్నది.