ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి గ్రామం శివారులో ఉన్న బొగత జలపాతం పర్యాటకులను అట్రాక్ట్ చేస్తోంది. ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు బొగత జలాపాతం పరవళ్లు తొక్కుతోంది. జలసవ్వడులు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేటి నుంచి బొగత జలపాతం సందర్శనకు పర్యటకులకి అనుమతి ఇచ్చారు అధికారులు. ములుగు జిల్లా వాజేడు మండలం బోగత జలపాతం సందర్శనకు పర్యాటకులను షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు అటవీ అధికారులు. Also Read:AP Government: అదానీకి షాక్..! ఆ…
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో పర్యాటకుల సందడి నెలకొంది. సెలవు రోజులు కావడంతో పర్యాటకులు కుటుంబ సమేతంగా విచ్చేసి ఆనందంగా గడుపుతున్నారు. దానికి తోడు శీతాకాలంలో ప్రకృతి అందంగా కనిపిస్తుంది. మారేడుమిల్లి ప్రాంతంలో పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. దట్టమైన కొండల మధ్యలో చావడికోట వ్యూ పాయింట్‌కి పర్యటకులు ఎగబడుతున్నారు.
ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకు లోయను ఇష్టపడని వారుండరు. శీతాకాలంలో ప్రకృతి అందాలను ఆస్వాధించేందుకు ఎంతో మంది అరకు వస్తుంటారు. అరకు లోయతో పాటు బొర్రా గుహలు, లంబసింగి, వంజంగి మేఘాల కొండలు లాంటి ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రాంతాలను సందర్శించేందుకు వేలాది మంది పర్యటకులు తరలివస్తుంటారు. ఈ క్రమంలో క్రిస్మస్, న్యూ ఇయర్ నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. Also Read: Tollywood Industry Meeting…
Himachal Pradesh: చలితో ఉత్తర భారతం గజగజా వణికిపోతుంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పర్యటక ప్రాంతమైన మనాలీపై మంచు కమ్మేసింది. హిమపాతం భారీగా ఉండటంతో పర్యటకులు నానా అవస్థలు పడుతున్నారు.
పర్యాటకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్ 26 నుంచి ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వారాంతంలో ప్రముఖ ఆధ్యాత్మిక దేవాలయాలు, పంచారామ క్షేత్రాలు సందర్శించేలా ఒక రోజు టూర్ ప్యాకేజీకి పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తుందని మంత్రి వెల్లడించారు.
పల్నాడు ప్రాంతం పర్యాటకులతో పోటు ఎత్తుతుంది. నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు ద్వారా దిగువ ప్రాంతానికి భారీగా వరద నీరు వదలడంతో.. ఆ సుందర దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు. గడిచిన కొద్దీ రోజులుగా ఏపీ, తెలంగాణ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు హాజరవుతున్నారు. నేడు ఆదివారం కావడంతో హైదరాబాద్ నుండి కూడా.. పెద్ద ఎత్తున పర్యాటకులు నాగార్జునసాగర్ సమీపంలోని సుందర జలపాతాలను సందర్శిస్తున్నారు.
Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జన సాగర్ లో సందడి చేస్తోంది. నాగార్జునసాగర్ జలాశయం నుంచి కిందకు పాలధారలా వస్తున్న కృష్ణానదిని చూసేందుకు జనం పోటెత్తారు.
Goa: బ్యాచిలర్లకు, కపుల్స్, ఫ్యామిలీ ఇలా ఎవరికైనా డ్రీమ్ డెస్టినేషన్లలో గోవా తప్పకుండా ఉంటుంది. బీచులు, మందు, విందు, నైట్ లైఫ్ ఇలా ప్రతీది ఆస్వాదించవచ్చు. అయితే, ఇప్పుడు మాత్రం మందు తాగుతూ, చెత్త ఎక్కడపడితే అక్కడ పడేస్తామంటే కదరదు.