తెలంగాణ ప్రజలకు మెగాస్టార్ విషెస్

తెలంగాణాలో ప్రజలు ఎంతో భక్తితో అమ్మవారిని కొలుస్తూ జరుపుకునే బోనాల పండగ ఈ రోజు నుంచి ప్రారంభం. ఈ నెల 26 వరకు బోనాల సంబరాలు అంబరాన్ని అంటనున్నాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తెలుగు ప్రజలకు బోనాల పండగ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.

Read Also : “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్స్ షురూ !

“బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు. తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు. వర్షాలు బాగా కురవాలని, పాడిపంటలు వృద్ధి చెందాలని, అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఆషాఢ మాసం అంతా జరిగే ఈ ఉత్సవాలను అందరూ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను” అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఇప్పటి నుంచి తెలంగాణలోని రోజుకో ప్రాంతంలో జరిగే బోనాల ఉత్సవాలు ప్రజల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపనున్నాయి. అయితే కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండడం మాత్రం మరవొద్దు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-