Commonwealth Games: 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ క్రీడలు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరగబోతున్నాయి. ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ కామన్‌వెల్త్ స్పోర్ట్ అహ్మదాబాద్‌ను కామన్వెల్త్ క్రీడల కోసం ఆతిథ్య నగరంగా సిఫారసు చేసింది. చివరిసారిగా 2010లో భారత్ ఈ మల్టీ స్పోర్ట్స్ ఈవెంట్‌ను నిర్వహించింది. రెండోసారి భారత్ 2030లో ఆతిథ్యం ఇవ్వబోతోంది. 2030 కామన్వెల్త్ గేమ్స్ క్రీడలు, సంస్కృతి, ఐక్యతకు గొప్ప వేదికగా నిలుస్తుందని భావిస్తున్నారు. భారతదేశ ఆర్థిక శక్తి, శక్తి…
Double-Decker Buses: చాలా కాలంగా ఎదురు చూస్తున్న అతిథి విశాఖకు వచ్చింది. బీచ్ టూరిజంకు అదనపు ఆకర్షణగా చేరింది. బీచ్ రోడ్డులో షికారు చేసేందుకు డబుల్ డెక్కర్ బస్సు సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. దీంతో పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచేందుకు రెండు బస్సులను అధికారులు తీసుకుని వచ్చారు.
ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లాను నక్సల్ ప్రభావిత ప్రాంతాల జాబితా (LWE - లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం) నుంచి తొలగిస్తూ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఇది ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రానికి, ముఖ్యంగా బస్తర్‌కు ఒక చారిత్రాత్మక విజయంగా పరిగణించబడుతుంది. గత కొన్ని ఏళ్లుగా భద్రతా దళాలు, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రజల ఉమ్మడి ప్రయత్నాల కారణంగా బస్తర్‌లో నక్సలైట్ల ఏరివేత సమర్థవంతంగా ముగిసింది. ఈ ప్రాంతంలో ప్రస్తుతం శాంతి పునరుద్ధరించబడింది.
హల్గామ్ ఉగ్ర దాడితో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర టూరిజంపై తీవ్ర ప్రభావం పడింది. దీని వల్ల కాశ్మీరీల ఉపాధితో పాటు ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ దాడి జరగడంతో ఇక్కడికి వచ్చేందుకు టూరిస్టులు భయపడుతున్నారు. అయితే, ఇప్పటికే కశ్మీర్ కు బుక్ చేసుకున్న టికెట్లు రద్దు చేసుకున్నారు.
Warangal Airport: తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా మామునూరులో కొత్త విమానాశ్రయం నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. ఎయిర్‌పోర్ట్ అభివృద్ధిపై గత కొంతకాలంగా కొనసాగుతున్న కసరత్తులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మామునూరును విమానాశ్రయంగా అభివృద్ధి చేయాలని గతంలోనే ప్రతిపాదనలు పంపగా, తాజాగా కేంద్రం దీనికి అంగీకారం తెలిపింది. ఈ నిర్ణయంతో వరంగల్ ప్రాంతానికి ప్రయాణ సౌకర్యాలు మరింత పెరగనున్నాయి. విమాన ప్రయాణాల విస్తరణ, వ్యాపారం, పర్యాటకం అభివృద్ధికి మామునూరు ఎయిర్‌పోర్ట్…
Delhi Red Fort: మొఘల్ కాలంలో నిర్మించిన ఢిల్లీ ఎర్రకోట భారతదేశానికి గర్వకారణంగా మారింది. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న భారత ప్రధానమంత్రి ఢిల్లీలోని ఎర్రకోట నుండి జెండాను ఎగురవేస్తారు.
Viral Video: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఎంత ప్రాముఖ్యత వహిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో కొందరు కంటెంట్ క్రియేటర్స్ గా మారి ప్రపంచంలోని వివిధ అంశాలపై వీడియోలు చేస్తూ పాపులర్ అవుతున్నారు. ఇకపోతే, కొందరు విదేశీయులు భారతదేశంలోని అనేక ప్రాంతాలను సందర్శించి వారికి నచ్చిన అంశాలని.. అలాగే వారికి జరిగిన సంఘటనలను సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటారు. ముఖ్యంగా ట్రావెల్ కంటెంట్ సృష్టికర్తలు వివిధ దేశాల్లోని పరిస్థితులను తెలియజేస్తూ…
రాష్ట్రంలో అదిలాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్ వంటి జిల్లాల్లో పచ్చని, దట్టమైన అడవులు.. జలపాతాలు ఉన్నాయి. వాటిని గుర్తించి ఐటీ ఉద్యోగులు, జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించి ఆదాయాన్ని పెంచుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ఆయన సచివాలయంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పర్యాటక, సాంస్కృతిక, క్రీడా, ఎన్సీసీపై బడ్జెట్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
మన రాష్ట్రం సినిమాటోగ్రఫీకి అనేక విధాలుగా తోడ్పడిందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కోనసీమ , కృష్ణా పర్యాటక ప్రాంతాల్లో అనేక షూటింగులు జరిగాయని.. గత పాలకులకు చిత్తశుద్ధి ఉంటే కేరళ నుంచి కోనసీమను అభివృద్ధి చేసేవాళ్లని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు.
చుట్టూ అందమైన పుష్పాలే.. స్వర్గానికి వచ్చామా అనే అనుభూతిని కలిగిస్తుంది ఆ ప్రదేశం. ఆ ప్రదేశమే ఉత్తరాఖండ్‌లోని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. ఉత్తరాఖండ్‌లోని చమోలిలో ఉన్న వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్(పూల లోయ) జూన్ 1, 2024 నుండి పర్యాటకుల కోసం తెరవబడుతుంది. ఈ ఏడాది ఇది అక్టోబర్ 30 వరకు తెరిచి ఉంటుంది. పర్యాటకులు జూన్ నుంచి అక్టోబర్ వరకు ఎప్పుడైనా ఇక్కడకు వెళ్లడానికి ప్లాన్ చేసుకోవచ్చు.