East Godavari: తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాజానగరం మండలంలోని పల్ల కడియం గ్రామంలో వృద్ధ దంపతులు ప్రాణాలను కోతి తీసింది. ఫురుగు మందుల ప్యాకెట్ తీసుకుని వచ్చి వృద్ధ దంపతులు పేరట్లో పారేసిన కోతి.. అయితే, టీ పొడి అనుకుని పొరపాటున పురుగుల మందు వేసుకొని టీ తాగిన వెలుచూరి గోవింద్ (75), అప్పాయమ్మ (70) వృద్ధ దంపతులు మృతి చెందారు. అయితే, అప్పాయమ్మకు కంటి చూపు తక్కువగా ఉండడంతో పుగుగుల మందు ప్యాకెట్ ను, టీ ప్యాకెట్ గా భావించి టీ పెట్టుకొని ఈ వృద్ధ దంపతులు త్రాగారు.
Read Also: Ponnam Prabhakar: నిమజ్జన ఉత్సవాల్లో ఇబ్బందులు కలిగితే అధికారుల దృష్టికి తీసుకురండి..
కాగా, ఆ పురుగుల మందు కలిపిన టీ తాగిన కొద్దిసేపటికి ఆ వృద్ధ దంపతుల నోటి నుంచి నురగలు రావడం గమనించిన స్థానికులు వెంటనే రాజమండ్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఇక, చికిత్స పొందుతూ వృద్ధ దంపతులు మృతి చెందారు. ఈ సంఘటనతో పల్లకడియం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.