Ponnam Prabhakar: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను హైదరాబాద్ ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మండప నిర్వహకులు సాధ్యమైనంత వీలుగా వినాయక విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేసి సహకరించగలరన్నారు. నిమజ్జనం సమయంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈనెల 17వ తేదీ మంగళవారం హైదరాబాద్ లో జరిగే గణేష్ నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసిందన్నారు. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగిందన్నారు. ఎటువంటి అపోహలు దుష్ప్రచారాలు నమ్మవద్దు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అందరం కలిసి గణేష్ నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరుపుకుందామన్నారు. నిమజ్జన ఉత్సవాల్లో ఎక్కడైనా ఇబ్బందులు కలిగితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.
Read also: CM Revanth Reddy: నేడు మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి..
గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నవిషయం తెలిసిందే. గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మరణించిన గల్ఫ్ కార్మికుల కుటుంబానికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా.. ప్రజా భవన్ లో జరిగే ప్రజావాణి లో గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. గల్ఫ్ కార్మిక కుటుంబాల పిల్లలకు గురుకులాల్లో సీట్లు ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అయితే.. గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి పదేండ్లుగా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించి.. పార్టీ మేని ఫెస్టోల్లో సైతం అంశాన్ని చేర్చి గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు భరోసా ఇస్తామని పేర్కొన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్నా బీఆర్‌ఎస్ ఏనాడు పట్టించుకోలేదు. అయితే.. ఎన్ఆర్ఐ పాలసీ పై తీవ్ర నిర్లక్ష్యం చేసింది. గల్ఫ్ కార్మిక సంఘాల ప్రతినిధులతో ఈనెల 17న సీఎం ప్రత్యేకంగా భేటీ కానుండడం ప్రాధాన్యం సంతరించకుంది.
Governor Rabindranarayana: ‘రామున్ని ఉత్తర భారతదేశానికి పరిమితం చేసేందుకు యత్నిస్తున్నారు.’